Horoscope Today 10th December 2024
మేష రాశి
మేష రాశి వారు ఈ రోజు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. పరస్పర ఆలోచనల మార్పిడితో మనసు ఆనందంగా ఉంటుంది. ఓర్పు , సంయమనంతో పని చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. కార్యాలయంలో ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సరైన సమయంలో ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు.
మిథున రాశి
నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ నిరీక్షణ ఫలిస్తుంది. సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. చార్టర్డ్ అకౌంటెంట్లకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. పాత స్నేహితులు మీకు ఉపయోగపడగలరు. జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఆత్మవిశ్వాసమే అతిపెద్ద బలం.
Also Read: డిసెంబరు 09 to 15 వారఫలాలు: ఆదాయం, ఆనందం, గౌరవం..ఈ రాశులవారికి ఈ వారం బాగా కలిసొస్తుంది
కర్కాటక రాశి
ఈ రాశి వారికి వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ సామర్థ్యాలను సమర్థంగా వినియోగిస్తారు. అతిథులను ఆహ్వానిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహ రాశి
ఈ రాశివారు తమ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను స్థిరంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు. వ్యాయామం , ధ్యానంపై దృష్టి సారించండి. మీ బలహీనతలు అందరి ముందు బయటపడతాయి.
కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలోని అయోమయాన్ని తొలగించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సంస్థలలో దానధర్మాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
తులా రాశి
మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ తెలివితేటలు ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటాయి. కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల నుంచి లాభపడతారు.
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తారు. వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు మెరుగైన ఫలితాలను పొందుతారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడం గురించి ఆలోచిస్తారు.
ధనుస్సు రాశి
మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దొద్దు. సోమరితనం కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. మీ పనితీరును వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతుంది. మీ దినచర్యలో కొంత గందరగోళం ఉంటుంది. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మంచి సమాచారాన్ని పొందుతారు
Also Read: ఈ రాశులవారికి ఈ వారం నిరాశగా ఆరంభమై ఉత్సాహంగా పూర్తవుతుంది!
మకర రాశి
ఈ రాశివారు లక్ష్యాలు సాధించడానికి కృషి చేస్తారు. వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. పెద్దల నుంచి మంచి సలహాలు పొందుతారు. అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.
కుంభ రాశి
మీ భావోద్వేగాలను నియంత్రించండి. మీ మనసులో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందనే భయం ఉంటుంది. ఆలోచనాత్మకంగా మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించండి. అనారోగ్య సమస్యను తేలిగ్గా తీసుకోవద్దు.
మీన రాశి
మీ జీవిత భాగస్వామి సలహాను పరిగణలోకి తీసుకోండి. ఆర్థికపరిస్థితి మీరు ఊహించనంతగా మారుతుంది. ప్రారంభించిన పనులు నిజాయితీగా పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు వేస్తారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రయోజనం పొందుతారు.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.