Makar Sankranti 2024 : సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ మాత్రమే కాదు..ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా. నెలరోజులకో రాశిలో సంచరించే సూర్యుడు... ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగే మకర సంక్రాంతి. అందుకే ప్రతి రాశివారూ తమ జాతకంలో ఉన్న గ్రహబాధల నుంచి విముక్తి లభించేందుకు సంక్రాంతి సమయంలో దాన ధర్మాలు చేస్తారు. మరి ఏ రాశివారు ఏ దానం చేస్తే గ్రహాల అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుని అనుసరించాలని పండితులు సూచిస్తున్నారు...
మేష రాశి (Aries)
మేష రాశివారు మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లం, మిరపకాయలు, ఎర్రటి వస్త్రం, పప్పు దానం చేయాలి
వృషభ రాశి (Taurus)
వృషభ రాశివారు సంక్రాంతికి తెల్ల నువ్వుల లడ్డూ, బియ్యం, పంచదార , దుస్తులు దానం చేస్తే మంచిది
మిథున రాశి (Gemini)
ఈ రాశివారు గ్రహ శాంతి కోసం నువ్వులు దానం చేయడంతో పాటూ..కూరగాయలు, పెసరపప్పు స్వయంపాకం సమర్పించాలి.
Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశివారు మకర సంక్రాంతి రోజున తెల్లని వస్త్రం, నెయ్యి , నువ్వులతో పాటు సగ్గుబియ్యం దానం చేయాలి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారు మకర సంక్రాంతి నాడు బెల్లం, తేనె, వేరుశెనగలను , నువ్వులు, వస్త్రాలను దానం చేయాలి
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారు మకర సంక్రాంతి రోజున మినుములు, నువ్వులు, నూనె దానం చేస్తే గ్రహబాధలు తగ్గుతాయి
Also Read: మకర సంక్రాంతి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతోంది, జనవరి 15 రాశిఫలాలు
తులా రాశి (LIbra)
తులారాశి వారు మకర సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రం, వెన్న, బియ్యం, పంచదార , నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది.
వృశ్చిక రాశి (Scorpio)
సంక్రాంతి సమయంలో నువ్వులు, బియ్యం, బెల్లం, ఎరుపు రంగు వస్త్రం దానం చేయాలి
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారు మకర సంక్రాంతి రోజున అరటిపండ్లు, శనగలు, నువ్వులు, పసుపు రంగు వస్త్రం దానం చేయాలి
మకర రాశి (Capricorn)
మకర రాశి వారు మకర సంక్రాంతి రోజు నల్ల నువ్వులు, వస్త్రాలు దానం చేయాలి
Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!
కుంభ రాశి (Aquarius )
కుంభ రాశి వారు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలు,చెప్పులు సంక్రాంతికి దానం చేస్తే గ్రహాల అనుగ్రహం లభిస్తుంది.
మీన రాశి (Pisces )
మీన రాశి వారు మకర సంక్రాంతి రోజు శనగలు, సగ్గుబియ్యం, నువ్వులు, వస్త్రాలు దానం చేయాలి.
Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!
వీటితో పాటు మహిళలు సంక్రాంతి సమయంలో పసుపుకుంకుమలు, పళ్లు దానం చేస్తే..వైవాహిక జీవితం బావుంటుందని పండితులు సూచిస్తున్నారు..
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Also Read: సంక్రాంతికి ముగ్గులో 'సిరులు పొంగే కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!