Lunar eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు జాతకాలపై ప్రభావం చూపిస్తాయంటారు  జ్యోతిష్య శాస్త్ర పండితులంటే. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు. మార్చి 25 హోలీ రోజు చంద్రగ్రహణం. ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందంటే...


మేష రాశి(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఈ రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో అనారోగ్య సూచనలున్నాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.


Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!


వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)


ఈ రాశి వారు  ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మరింత కష్టపడాలి. ఉద్యగులకు చిన్న చిన్న సమస్యలు తప్పవు. ఆకలితో ఉండేవారికి అన్నదానం చేయండి.


మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)


చంద్ర గ్రహణం మిథున రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తోంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. అప్పులు చెల్లించగలుగుతారు. సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయి. పశువులకు మేత తినిపించండి. 


కర్కాటక రాశి (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)


చంద్ర గ్రహణం ఈ రాశివారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో పనిని నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ శ్లోకాల్లో చంద్రుడి శ్లోకం జపించండి. 


Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!


సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


చంద్రగ్రహణం సింహ రాశివారికి శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. చేసే పనికి ప్రశసంలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సూర్యు బీజ మంత్రాన్ని జపించండి. 


కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


ఈ రాశి వారికి చంద్ర గ్రహణం కాలంలో అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యోం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. గోమాతకు సేవ చేస్తే శుభ ఫలితాలుంటాయి. 


తులా రాశి  (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


చంద్రగ్రహణ తులారాశివారి వైవాహిక జీవితంలో సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. పేదలకు అన్నదానం చేయండి.


వృశ్చికం (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


వృశ్చిక రాశివారికి చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ రాశి ఉద్యోగులు వారు పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)


ధనస్సు రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది చంద్రగ్రహణం. ఏ విషయంలోనూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. గోమాతకు సేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 


మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


చంద్రగ్రహణం మకర రాశివారిని సమస్యల్లో నెట్టేస్తుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు సూర్య బీజ మంత్రం జపించాలి. 


కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఈ రాశి వారు తొలి చంద్ర గ్రహణం వేళ  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల్లో నియంత్రణ అవసరం. చంద్రగ్రహణం సందర్భంగా మీరు చెప్పులు దానం చేయండి. 


(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


మీన రాశివారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలనివ్వదు. బృహస్పతి బీజ మంత్రాన్ని జపించండి. మూగజీవాలకు ఆహారం అందించండి. 


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.