Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒకరి జాతకాన్ని పుట్టిన సమయం ఆధారంగా చేసుకుని అప్పుడున్న గ్రహస్థితిని పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు. రాశి చక్రం, అంశ చక్రం వేసి భవిష్యత్ ని అంచనా వేస్తారు. మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహ దశల ఆధారంగా ఏ సమయంలో మీకు మంచి జరుగుతుంది ఎన్నేళ్లు దురదృష్టం వెంటాడుతుందన్నది చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇందులో చాలా విషయాలు వస్తాయి. మీరు కట్టుకునే ఇల్లు, మీరు వాడే వాహనం..ఇవన్నీ కూడా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి.

Continues below advertisement


వాహనం అనేది టూ వీలర్ or ఫోర్ వీలర్..ఇప్పుడంటే అందరింట్లో సాధారణం అయిపోయింది కానీ ఒకప్పుడు ఇది విలాసానికి చిహ్నంగా భావించేవారు. అందుకే కొనుగోలు చేసే సమయం మొదలు దాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ పూర్తిచేసి వినియోగించేవరకూ మంచి రోజు చూసుకునేవారు. తిథి, వారం, నక్షత్రం అన్నీ సరిచూసుకునేవారు. ఎందుకంటే నక్షత్రం ప్రకారం నప్పని రంగు వాహనాన్ని వినియోగిస్తే దానివల్ల సంతోషం కన్నా చికాకులు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అందుకే నప్పే రంగు వాహనాన్ని ఎంపిక చేసుకునేవారు. మరి వాహనం రంగు ఏది తీసుకోవాలో ఎలా తెలుస్తుందంటే.. అది మీ జన్మ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది . మీ నక్షత్రం ఏంటో మీకు తెలిస్తే మీరు వినియోగించాల్సిన వాహనం రంగు కూడా తెలిసినట్టే...ఇదిగో డీటేల్స్...
  
ఏ నక్షత్రం వారికి ఏ రంగు వాహనం అనుకూలం


అశ్విని నక్షత్రం
ఈ నక్షత్రం వారికి సిల్వర్ కలర్  ఫస్ట్ ప్రయార్టీ,  కాదంటే రెడ్  తీసుకోవచ్చు


భరణి నక్షత్రం
ఈ నక్షత్రం వారికి వైట్ , సిల్వర్ కలర్ రంగు వాహనం కలిసొస్తుంది


కృత్తిక నక్షత్రం
ఈ నక్షత్రం వారికి రెడ్, వైట్ వాహనాలు కలిసొస్తాయి


రోహిణి నక్షత్రం
ఈ నక్షత్రం వారికి వైట్ కలర్ వాహనం బాగా అనుకూలం.. తప్పదంటే సిల్వర్ కూడా తీసుకోవచ్చు


మృగశిర నక్షత్రం
మృగశిర నక్షత్రం వారికి రెడ్ నప్పుతుంది... సెకెండ్ ప్రయార్టీ కింద మొదటి రెండు పాదాలకు వైట్, మూడు నాలు పాదాలకు ఎల్లో


ఆరుద్ర నక్షత్రం
ఈ నక్షత్రం వారికి నీలం, నలుపు,  కాఫీ కలర్ ,రంగులు నప్పుతాయి..లాస్ట్ ప్రయార్టీ గ్రీన్


పునర్వసు నక్షత్రం
వైట్, సిల్వర్ కలర్ నప్పుతాయి లాస్ట్ ప్రయార్టీ గ్రీన్


పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్రంవారికి నప్పే వాహనం రంగు బ్లూ,  బ్లాక్, వైట్


ఆశ్లేష నక్షత్రం
ఈ నక్షత్రం వారికి గ్రీన్, వైట్ రంగు వాహనాలు అనుకూలం


మఖ నక్షత్రం
వైట్ అండ్ సిల్వర్ వాహనం అనుకూలం


పుబ్బ నక్షత్రం
ఈనక్షత్రం వారికి  తెలుపు, బూడిద రంగు వాహనాలు అదృష్టాన్నిస్తాయి ఈ రెండు కాదనుకుంటే రెడ్


ఉత్తర నక్షత్రం
రెడ్ ఫస్ట్ ప్రయార్టీ తప్పదంటే వైట్ పర్వాలేదు


హస్త నక్షత్రం
హస్త నక్షత్రం వారికి వైట్, సిల్వర్,  బ్లూ రంగు వాహనాలు అనుకూలం


చిత్త నక్షత్రం
రెడ్ మంచిది, తప్పదంటే సిల్వర్  కూడా నప్పుతుంది


స్వాతి నక్షత్రం
బ్రౌన్, సిల్వర్


విశాఖ నక్షత్రం
ఎల్లో, సిల్వర్..వైట్ కూడా


అనూరాధ నక్షత్రం
బ్లూ అంట్ బ్లాక్...తప్పదంటే రెడ్


జ్యేష్ట నక్షత్రం
వైట్ అండ్ సిల్వర్, గ్రీన్


మూల నక్షత్రం
వైట్,సిల్వర్
 
పూర్వాషాడ నక్షత్రం
సిల్వర్, ఎల్లో


ఉత్తరాషాడ నక్షత్రం
ఉత్తరాషాడ నక్షత్రం మొదటి రెండు పాదాల వారికి ఎరుపు, పసుపు రంగు...మూడు నాలుగు పాదాల వారికి ఎరుపు, నీలం
 
శ్రవణం నక్షత్రం
వైట్, సిల్వర్..లాస్ట్ ప్రయార్టీ బ్లూ


ధనిష్ట నక్షత్రం
ఈ నక్షత్రం వారికి రెడ్, బ్లూ కలిసొచ్చే వాహనం రంగులు


శతభిషం నక్షత్రం
బ్లూ, బ్లాక్, బ్రౌన్


పూర్వాభాద్ర నక్షత్రం
ఎల్లో,బ్లూ


ఉత్తరాభాద్ర నక్షత్రం
ఈ నక్షత్రం వారికి నీలం, నలుపు


రేవతి నక్షత్రం


ఈ నక్షత్రం వారికి ఆకుపచ్చ, తెలుపు రంగు కార్లు కలిసొస్తాయి
 


గమనిక: వివిధ శాస్త్రాలు, ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్న వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని పరిగణలోకి తీసుకునేందుకు మీరు సంపూర్ణంగా నమ్మే పండితుల సలహాలు కూడా స్వీకరించండి. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే.


తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి