Love Horoscope Today 22nd November 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...


మేష రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామితో కొన్ని చర్చలు ఉన్నప్పటికీ సంతోషంగా ఉంటారు. అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు ఖర్చులు తగ్గించడం మంచిది.  ప్రేమికులు ప్రేమ జీవితంలో డబ్బు ఖర్చు అవుతుంది. 


వృషభ రాశి
ఈ రోజు ప్రేమ జీవితానికి పూర్తి ఆనందంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో కలసి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా సాగుతుంది.


మిథున రాశి
మీ మనసులో మాటని స్పష్టంగా చెప్పడం వల్ల జీవిత భాగస్వామి సంతోషిస్తారు.  చిన్న చిన్న ఆలోచనలు మార్చుకుంటే మీ అనుభంధం బలపడుతుంది. పెళ్లి దిశగా అడుగేయాలంటే ప్రేమికులకు ఇదే మంచి సమయం


Also read: 2023లో ఆరంభంలో ఈ రాశివారు మానసికంగా బాధపడతారు, ఆర్థికపరిస్థితి మాత్రం ఆశాజనకం


కర్కాటక రాశి
ఈ రాశి ప్రేమికుల మధ్య విభేదాలు రావొచ్చు. పంతానికి పోయి మాట జారితే బంధం పూర్తిగా విడిపోయే ప్రమాదం ఉంది. వివాహితులు మాత్రం..జీవిత భాగస్వామికి విధేయులుగా ఉంటారు. 


సింహ రాశి 
ఈ రోజు మీరు మీ భాగస్వామి పట్ల అనువుగా ఉంటారు. ప్రేమికుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. భవిష్యత్ కోసం సరైన ప్రాణాళికలు వేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమపూర్వకమైన బహుమతి అందుకుంటారు


కన్యా రాశి
ప్రేమ జీవితంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి మాటలను తిప్పికొట్టి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. ఒకరికొకరు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తే కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. 


తులా రాశి 
 ఈ రాశివారు జీవిత భాగస్వామి కోపాన్ని ఇట్టే పోగొట్టగలరు. ప్రేమ జీవితంలో పరస్పరం ప్రేమ పెరుగుతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రత్యేకమైన మహిళా స్నేహితురాలితో సాన్నిహిత్యం పెరుగుతుంది.


Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది


వృశ్చిక రాశి
వైవాహిక జీవితంలో బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాలి. మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి ఓ శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో కోపం తెచ్చుకోవచ్చు.


ధనుస్సు రాశి
వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.  నిన్నటి వరకూ ఉన్న సమస్యలు తీరిపోయి ప్రశాంతత నెలకొంటుంది.ప్రేమికులు బహుమతులు అందుకుంటారు


మకర రాశి
ఈ రాశివారు తాము ప్రేమించిన వ్యక్తుల పట్ల ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు. కొత్తగా పెళ్లైన వారు ఓ శుభవార్త వింటారు. జీవిత భగస్వామితో కలసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచిసమయం. 


కుంభ రాశి 
 కుటుంబ సమస్యలపై జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు. వివాహం కానివారు పెళ్లికి సుముఖంగా మారుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.


మీన రాశి 
మీ భాగస్వామికి దూరంగా ఉండటం వల్ల మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి వెళతారు.


మేష రాశి నుంచి కన్యా రాశి వరకూ వారఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....


తులా రాశి నుంచి మీన రాశి వరకూ ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.....