Love and Relationship Horoscope 9th June 2023


మేష రాశి


ఈరోజు ఈ రాశి ప్రేమికులకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల నుంచి మీ ప్రేమకు అంగీకారం లభించదు, వివాహితుల జీవితం బావుంటుంది. 


వృషభ రాశి
ఈ రాశి ప్రేమికులు పెద్ద టెన్షన్ నుంచి బయటపడతారు. పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి రోజు. వివాహితులు కుటుంబంలో ఉన్న సమస్యలను మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటారు. 


మిథున రాశి


ఈ రాశి ప్రేమికులకు మంచి రోజు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామికి మంచి బహుమతి అందిస్తారు.  ప్రేమికుల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.


Also Read: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!


కర్కాటక రాశి


మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడేవారు మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉంది. సన్నిహితులు ఎవరైనా మీ ప్రేమ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోపం తగ్గించుకుని శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


సింహ రాశి
ఈ రాశి వివాహితులు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించుకోవాలి. కొంత సమయం కేటాయించుకోవడం ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ రాశి ప్రేమికులను ఏదో భయం వెంటాడుతుంది. ఓ వ్యక్తిపట్ల మీకు ఆకర్షణ పెరుగుతుంది. 


కన్యా రాశి


ఈ రాశి వివాహితులు, ప్రేమికులు జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే మూడో వ్యక్తికి ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే ధోరణి తగ్గించుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో ఆచితూచి స్పందించకపోతే ఇబ్బందుల్లో పడతారు.


తులా రాశి


ఈ రాశివారు పాత ప్రేమికులను కలుస్తారు. ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుడి నుంచి శుభవార్త వింటారు. అనవసర టెన్షన్ తగ్గించుకుంటే మంచిది.


Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!


వృశ్చిక రాశి 


ఈ రాశివారు తమ ప్రేమ భాగస్వామిని కలుసుకున్న తర్వాతా చాలా సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారు జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. 


ధనుస్సు రాశి


ఈ రాశివారు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు రిస్క్ తీసుకోవద్దు. వివాహితుల మధ్య బంధం బాగానే ఉంటుంది. ప్రేమికుల మధ్య సమస్యలుంటాయి కానీ తొలిదశలో ఉండగానే పరిష్కరించుకోవాలి 


మకర రాశి
ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదిస్తారు. పెళ్లిచేసుకోవాలి అనుకునే ఆలోచనను అమల్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. వివాహితులకు అద్భుతమైన రోజు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 


కుంభ రాశి


ఈ రాశి ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవితంలో ముందడుగు వేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. 


మీన రాశి


ఈ రాశివారు కోపం తగ్గించుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు కానీ తమ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారి ఆలోచనను గ్రహించి నడుచుకుంటే మంచిది.