Horoscope Today November 18, 2024 మేష రాశి

ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో వివాదాలున్నాయి జాగ్రత్త. ఓ శుభవార్త  అందుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

వృషభ రాశి

మీరు ఈరోజంతా చాలా సంతోషంగా ఉంటారు. వాదనలకు దూరంగా ఉండాలి. మధ్యాహ్నం తర్వాత మీ బిజీ మరింత పెరుగుతుంది.  ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తుల నుంచి మీరు నిర్లక్ష్యానికి గురవుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది

మిథున రాశి

ఈ రోజు ఆర్థిక పరిస్థితికి సంబంధించి వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ఆత్మీయుల ప్రవర్తన వల్ల ఒత్తిడికి లోనవుతారు. పూజలపై చాలా ఆసక్తిని కనబరుస్తారు. మీరు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీరు పాత అప్పులను తిరిగి చెల్లించగలరు.

కర్కాటక రాశి

ఈ రోజు ఆర్థికంగా లాభపడతారు. సహోద్యోగుల ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతారు. మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో తప్పకుండా పంచుకోండి. ఈ రోజు మీరు పనిలో ఓపికగా ఉండాలి.

Also Read: ఈ రాశులవారు ఈ వారం కలల ప్రపంచం నుంచి బయటపడితే అన్నీ శుభఫలితాలే!

సింహ రాశి

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాహ బంధం గురించి మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. కొత్త ప్రాజెక్టులపై ఉత్సుకత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

కన్యా రాశి 

ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటారు. ఉద్యోగస్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఇల్లు కొనడం లేదా నిర్మించాలనే ఆలోచన వస్తుంది.ఓ శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు.

తులా రాశి

ఓసారి ఆలోచించిన తర్వాతే ఎవరితో అయినా మాట్లాడండి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతతో లోతైన జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ సభ్యుల సౌకర్యాలపై శ్రద్ధ వహించండి. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. కొత్త వ్యాపారాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ ఆలోచనలను అద్భుతంగా ఉంచుకోండి.

వృశ్చిక రాశి

ఈ రోజు  మీ ఆత్మగౌరవం గురించి ఆందోళన ఉంటుంది. పని ప్రదేశంలో కొన్నితీర్మానాలు అమలు చేస్తారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన చేయవద్దు. ఖర్చులు పెరగడం వల్ల మనసు అసంతృప్తిగా ఉంటుంది. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొస్తాయి , శత్రువులు కూడా మిత్రులవుతారు!

ధనస్సు రాశి

ఈ రోజు మీకు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ఇంటి అవసరాలను మీరు చూసుకుంటారు. సంబంధాల విషయంలో కాస్త సున్నితంగా ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం ఉంటుంది.

మకర రాశి

ఈ రోజు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయడం సరికాదు. కార్యాలయంలో రాజకీయాలు ఉండవచ్చు. ఇంటికి ఆకస్మికంగా అతిథుల వస్తారు. స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు పరుష పదాలు వినియోగించవద్దు.  ఆహార నియమాలు పాటించడం మంచిది

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

కుంభ రాశి

ఈ రోజంతా కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. దగ్గరి బంధువుల ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యక్తిగత జీవితంలో అనుమానాలకు తావివ్వవద్దు.

మీన రాశి

ఈ రోజు పనిలో నాణ్యత పెరుగుతుంది. భౌతిక సుఖాలను అనుభవిస్తారు. ముఖ్యమైన పనులను మొదటి ప్రాధాన్యతలో ఉంచుతూ పూర్తి చేస్తారు.   విద్యార్థులు పెద్ద విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.