Apple iPhone: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ అతిపెద్ద సమస్య బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్. ఈ సమస్య ఐఫోన్ వినియోగదారులకు కూడా సాధారణం. ఎందుకంటే కొన్నిసార్లు ఛార్జింగ్ వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. మీ ఐఫోన్ కూడా నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంటే కొన్ని సులభమైన టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.


ఒరిజినల్ ఛార్జర్ వాడండి
మీ ఐఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎప్పుడూ ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌ని ఉపయోగించండి. డూప్లికేట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే ఛార్జింగ్ స్పీడ్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది.



Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


ఫ్లైట్ మోడ్‌లో ఛార్జ్ చేయండి
ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో అన్ని నెట్‌వర్క్ కనెక్షన్‌లు ఆఫ్ అవుతాయి. ఇది బ్యాటరీపై తక్కువ లోడ్‌ను పడేలా చేస్తుంది. ఛార్జింగ్ వేగాన్ని కూడా పెంచుతుంది.


చల్లగా ఉండే ప్రదేశంలో ఛార్జ్ చేయండి
ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ ఐఫోన్‌ను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేడిగా ఉండే బ్యాటరీ పెర్ఫార్మెన్స్‌ను ఎఫెక్ట్ చేస్తుంది.ఇది ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది.


ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి
మీకు ఐఫోన్ 8 లేదా అంత కంటే కొత్త మోడల్ ఉపయోగిస్తూ ఉంటే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఛార్జర్‌ని ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 18W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఛార్జర్‌ను కొనుగోలు చేయాలి. ఇది ఐఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయగలదు.


ఇది కాకుండా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను క్లోజ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు బ్యాటరీని వినియోగిస్తాయి. అవి ఛార్జింగ్ వేగాన్ని కూడా తగ్గిస్తాయి. అదేవిధంగా మీరు మీ ఐఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు. అయితే దీని తర్వాత కూడా మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంటే సర్వీస్ సెంటర్‌ను కచ్చితంగా సంప్రదించాలి.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!