Rath Yatra 2025:  ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరి ధామ్ లో భగవాన్ జగన్నాథ్ రథయాత్ర అద్భుతమైన వేడుకగా జరుపుకుంటారు. భారీ జనసందోహం, ఉత్సాహం, శ్రద్ధ , భక్తితో నిండిన ఈ యాత్ర  ఈ ఏడాది జూన్ 27 న జరుగుతుంది. ఈ రోజు భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి భగవాన్ జగన్నాథ్, బలభద్ర , సుభద్రల భారీ రథాలు లాగడానికి అదృష్టాన్ని పొందుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు..జగన్నాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునే అమూల్యమైన అవకాశం కూడా. 

జగన్నాథుడు జీవులన్నింటినీ సమానంగా చూస్తాడు కానీ..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై భగవంతుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశులవారి జీవితంలో సానుకూల మార్పులొస్తాయి. మానసికంగా, సామాజికంగా , ఆర్థికంగా బలపడతారు. వృషభ రాశి

వృషభ రాశి వారు సహనంగా వ్యవహరిస్తారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరిపై జగన్నాథుడి అనుగ్రహం ఉంటుంది. స్వామివారి అనుగ్రహంతో వారి జీవితంలో స్థిరత్వం ,  సమతుల్యత వస్తుంది. వారు తమ శ్రమకు తగిన ఫలితాన్ని సకాలంలో పొందుతారు.  కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వీరిలో లోతైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది, ఇది కష్ట సమయాల్లో కూడా వారిని కృంగదీయదు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. శ్రీకృష్ణుడి కృప వారిపై ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, సహకారం వీరిపై ఉంటుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, భగవంతుని స్మరణ వారికి భరోసా మరియు ధైర్యాన్ని ఇస్తుంది. వారి విశ్వాసం వారిని లోపలి నుంచి మరింత  శక్తివంతం చేస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారు పుట్టుకతోనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి. జగన్నాథ్ కృపతో వారి జీవితంలో నాయకత్వ అవకాశాలు పెరుగుతాయి. వారు ఏదైనా సవాలును ఎదుర్కొన్నప్పుడు దానిని అవకాశంగా మార్చుకునే శక్తి దైవిక ప్రేరణ ద్వారా లభిస్తుంది. సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వీరి ఆలోచనా విధానం అందర్నీ మెప్పిస్తుంది. తులా రాశి

తులా రాశి సమతుల్యత, అందం , శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. భగవాన్ జగన్నాథ్ కృపతో ఈ రాశి వారి జీవితం సామరస్యంగా ఉంటుంది. వారు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు . సంబంధాలలో స్థిరత్వాన్ని తెస్తారు. భక్తి మార్గంలో ముందుకు సాగినప్పుడు మానసిక స్పష్టత ,  అంతర్గత స్థిరత్వం వారికి తోడుగా ఉంటాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా మాత్రమే అందించాం. ఈ నమ్మకాన్ని, సమాచారాన్ని ఏబీపీ దేశం ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు..మీరు విశ్వశించే నిపుణుడిని సంప్రదించండి.

జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ ని పట్టిపీడిస్తోందా? రెండు దశాబ్దాల క్రితం ఏం జరిగింది? కర్మ ఫలం అంటే ఇదేనా!.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.