Jagannath Rath Yatra 2025: పూరి జగన్నాథ్ రథయాత్ర కళ్లారా  చూసి తరించేందుకు, రథం వెంట నడిచేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ రథయాత్రలో పాల్గొంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. రథయాత్రలో పాల్గొని జగన్నాథుని నామస్మరణ చేస్తూ గుండిచా  వరకు వెళ్ళేవారికి పునర్జన్మ ఉండదని స్కాంద పురాణంలో ఉంది.  పూరి జగన్నాథ్ రథయాత్ర ఏటా ఆషాఢమాసం ఆరంభంలో ప్రారంభమవుతుంది. 2025లో జూన్ 27న రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది రథయాత్ పూర్తి షెడ్యూల్ ఇదే జగన్నాథ్ రథయాత్ర 2025  షెడ్యూల్ (Jagannath Rath Yatra 2025)

10 జూన్ 2025 

జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథునికి సహస్రస్నానం జరిగింది. ఈ తర్వాత 15 రోజుల జగన్నాథుడు అనారోగ్యానికి గురవుతారు

16 జూన్ 2025 

అనసరి పంచమి రోజున భగవంతుని అవయవాలకు ఆయుర్వేద ప్రత్యేక నూనెతో మసాజ్ చేస్తారు. దీనిని ఫుల్లరి నూనె అంటారు. ఇది భగవంతుని చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఈ నూనె రాసిన తర్వాత జగన్నాథుడికి నెమ్మదిగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

20 జూన్ 2025 

అనసరి దశమి రోజున జగన్నాథుడు రత్న సింహాసనంపై కొలువుదీరుతారు.

21 జూన్ 2025 

జగన్నాథుని చికిత్స కోసం  మళ్లీ ప్రత్యేక ఔషధాలను పూస్తారు, దీనిని ఖలి లాగి అని పిలుస్తారు.

25 జూన్ 2025 

బలభద్ర, సుభద్ర , జగన్నాథుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

26 జూన్ 2025

ఈ రోజు జగన్నాథస్వామి నవ యవ్వన దర్శనం లభిస్తుంది. ఈ రోజున రథయాత్ర కోసం ఆయన నుంచి అనుమతి తీసుకుంటారు 27 జూన్ 2025 

ఈ రోజు గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర మొదటి రోజున అత్యంత ప్రసిద్ధమైన ఆచారం ఛెరా పహ్రా. ఇందులో ఒడిశా మహారాజు గజపతి బంగారు చీపురుతో రథాల ముందు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత రథాన్ని ముందుకు లాగుతారు

1 జూలై 2025 హేరా పంచమి

 'హేరా' అంటే వెతకడం 'పంచమి' అంటే ఐదవది అని అర్థం. లక్ష్మీదేవి..జగన్నాథుడు తిరిగి రావాలని ఎదురుచూసే సందర్భం ఇది.  జగన్నాథుడు తన తోబుట్టువుల దేవతలతో కలిసి తొమ్మిది రోజుల పాటు గుండిచా ఆలయం దగ్గర ఉండిపోతాడు. శ్రీమదిర్ నుంచి బయలుదేరేముందు ఒక్కరోజులో వస్తానని వాగ్ధానం  చేసి నాలుగు రోజులు గడిచినా రాకపోవడంతో ఐదో రోజు నుంచి వెతకడం ప్రారంభిస్తుంది లక్ష్మీదేవి. అదే హేరా పంచమి వేడుక.  

4 జూలై 2025 బహుదా యాత్ర (తిరిగి వచ్చే యాత్ర)

 పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు తిరిగి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి తిరిగివచ్చే యాత్ర. దీనినే బహుదా యాత్ర అంటారు

5 జూలై 2025 

రథయాత్ర ముగింపులో జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్రలకు వేసే ప్రత్యేకమైన బంగారు ఆభరణాల అలంకరణ. దీనినే  బంగారు వేషం,  రాజాధిరాజ బేష, సునా వేషం అంటారు. ఇందులో భాగంగా ఈ రోజు దాదాపు 138 రకాల బంగారు ఆభరణాలు అలంకరిస్తారు.  ఈ వేడుక చూసేందుకు లక్షలాది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి