Bomb threat mail to Begumpet airport హైదరాబాద్: గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒక దుండగుడి నుంచి ఈమెయిల్ రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే విమానాశ్రయంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. విమానాశ్రయంలో ఎలాంటి బాంబు, పేలుడు పదార్థాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.