2021 ఆగస్టు 17 మంగళవారం రాశిఫలాలు


మేషం


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపలేరు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. సకాలంలో పనిని పూర్తి చేయగలరు. ప్రభుత్వ పనులు పెండింగ్‌లో ఉంటాయి.


వృషభం


ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కార్యాలయ వాతావరణం చక్కగా ఉంటుంది. ఈరోజు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్దల సలహాను పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.


Also Read:ఈ వారం ఈ రాశులవారిని విజయం వరిస్తుంది….ఆ ఐదు రాశులవారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు…


మిథునం


కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. స్నేహితుడిని కలుస్తారు. ఇతరులకు సహాయం  చేయండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.


కర్కాటక రాశి


ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారవేత్తలు ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ నైపుణ్యంతో అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు.


ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…


సింహం


ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా వచ్చే ఖర్చు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతంది. మీ ప్రవర్తనలో చిరాకు, టెన్షన్ ఉంటుంది.  చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. ఈ రోజు ప్రయాణం చేయవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోకండి.


కన్య


ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పెట్టుబడి పెట్టొచ్చు. పని ప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. కార్యాలయంలో ఎవరితోనైనా ప ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వీక్లీ జాతకం


Also Read: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!


తులారాశి


ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. స్నేహితులతో అనవసర చర్చలుంటాయి. కొత్తగా ప్రారంభాలనుకునే పనుల ప్రణాళికను వాయిదా వేసుకోండి. మీ ప్రత్యర్థుల వల్ల నష్టాలు ఉండొచ్చు.  జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. రిస్క్ తీసుకోవద్దు.


వృశ్చికరాశి


వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. కొత్త పనిని ప్రారంభించవచ్చు. బాధ్యత పెరగడం వల్ల అలసటగా ఫీలవుతారు. ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.  మీ మనసులో అసహజమైన ఆలోచనలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అనవసరం వాదనలు వద్దు. కొత్త ప్రణాళికల విషయంలో పెద్దల అభిప్రాయం తీసుకోండి.


Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు


ధనుస్సు


అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. స్నేహితులతో కలసి వేరే నగరానికి వెళ్లే అవసరం రావొచ్చు. ప్రమాదకర పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.


మకరం


అన్నింటా విజయం వరిస్తుంది. నిరుద్యోగులకు శుభసమయం. ఉద్యోగలు సహోద్యోగుల సహకారం పొందుతారు. గొప్ప బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. టెన్షన్ పోతుంది. ఈ రోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త ప్రణాళికకు మంచిరోజు.


Aloso Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….


Also Read: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…


కుంభం


పూర్వీకులకు సంబంధించిన విషయాలు సంక్లిష్టంగా మారొచ్చు. సామాజికంగా గౌరవం పొందుతారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు. కారణం లేకుండా ప్రయాణం చేయవద్దు. ఖర్చులను నియంత్రించండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగి ఆర్థికంగా నష్టపోవచ్చు.


మీనం


ఈరోజు మంచి రోజు అవుతుంది. అనుకోని ఆదాయం అందుతుంది. బంధువులను కలుస్తారు. యోగా-వ్యాయామం అవలంబించవచ్చు. కుటుంబం మరియు పెద్దల ప్రేమను పొందుతారు. రోజులో కొంత సమయం పిల్లలతో గడపండి. ఈరోజు మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త సమాచారాన్ని పొందుతారు.


Also Read:ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు


Also Read:మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...