2021 ఆగస్టు 12 గురువారం రాశిఫలాలు
మేషం
మేషరాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా లేవు. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఉద్యోగస్తులకు బాగానే ఉన్నప్పటికీ ప్రమోషన్ కోసం ఎదురుచూసే వారికి ఇంకొంత కాలం ఆగకతప్పదు. కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగొచ్చు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శత్రువు బలంగా ఉంటాడు..మీరు అప్రమత్తంగా వ్యవహరించండి.
వృషభం
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. పెద్ద బాధ్యత నెరవేరుతుంది. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల సమస్యలు పరిష్కరించగలరు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పులిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రిస్క్ తీసుకోవద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మిథునం
కొన్ని సమస్యలపై స్నేహితులతో చర్చిస్తారు. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మీపై ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సామాజిక బాధ్యత పెరుగుతుంది. కొత్త పనిని ప్రారంభించవచ్చు. విద్యార్థులు కష్టపడాలి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
కర్కాటక రాశి
ఈ రోజు కుటుంబ కార్యక్రమాల వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ సమయం. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. అవసరమైన సదుపాయాలపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. ఎవరి మాటల్లోనూ జోక్యం చేసుకోకండి. వ్యాపారులకు అనుకూల సమయం.
సింహం
ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆఫీసులో ఎవరితోనైనా విభేదాలు ఉండవచ్చు. మీరు కొత్త ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నారు..వాటిని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఈ రోజంతా బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. యువత తమ లక్ష్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య
ఈరోజు కుటుంబ సభ్యులతో గడపండి. ఆర్ధికంగా కలిసొచ్చే సమయం. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు. మీరు చేస్తున్న పని విజయంపై నమ్మకం ఉంచండి. మీ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోనివ్వవద్దు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. పెండింగ్ పనులు ముందుకు సాగుతాయి. మీ ప్రవర్తన వల్ల చాలా మంది ప్రభావితమవుతారు.
తులారాశి
ఈరోజు బాగానే ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త ప్రణాళికలు వేసుకోండి. ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. మీ సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు.
వృశ్చికరాశి
ఈ రోజు అనవసర మాటలు కట్టిపెట్టండి. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు. ఒత్తిడికి గురవుతారు. వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచి రోజు కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. పాజ్ చేసిన పనులు పూర్తవుతాయి.
ధనుస్సు
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేక పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. తెలియని వ్యక్తుల వల్ల నష్టం ఉండవచ్చు. కొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ రోజు ప్రయాణాలు చేయవద్దు. గాయం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రస్తుతానికి పెట్టుబడి ఆలోచన వదులుకోండి. ఎక్కువ ఖర్చు చేయడం వల్ల ఆందోళన చెందుతారు.
మకరం
ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీ సలహాతో చాలా మంది పనులు పూర్తిచేసుకుంటారు. మీ నైపుణ్యంతో అనేక సమస్యలను అధిగమించగలుగుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. టెన్షన్ పోతుంది.
కుంభం
ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. కుటుంబ కార్యక్రమం కారణంగా బాధ్యత పెరుగుతుంది. నిజాయితీగా ఉంటే మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అపరిచిత వ్యక్తులతో ఎక్కువ చర్చలు వద్దు.
మీనం
మీరు ఈరోజు లాభం పొందుతారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. రిస్క్ తీసుకోకండి. జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉంటారు.