Astrological prediction for September 22, 2023


మేష రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రియమైనవారి ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. ఏదో అశాంతిగా ఉంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఉద్యోగులు సహోద్యోగులందరితో కలసిఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 


వృషభ రాశి
ఈ రాశివారు ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది.


మిథున రాశి
ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. సృజనాత్మక అభిరుచులు పెరుగుతాయి. కార్యాలయంలో ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు అవుతుంది.


Also Read: భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!


కర్కాటక రాశి
అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు పూర్తి చేసే ఆలోచనలో ఉంటారు. అనారోగ్య సమస్యలున్నాయి. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే చేయాలి. ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మనసులో ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. కమీషన్ సంబంధిత పనుల వల్ల ధనలాభం ఉంటుంది.


సింహ రాశి
ఈ రాశివారిని జీర్ణసంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ ప్రియమైనవారిపై విశ్వాసాన్ని కొనసాగించండి. వెన్నునొప్పితో ఇబ్బంది పడతారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు పని విషయంలో అశ్రద్ధ వహించవద్దు. 
 
కన్యా రాశి
ఈ రాశి ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపార పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఉంటుంది. సోదర, సోదరీమణులతో సంబంధాలు బావుంటాయి. 


తులా రాశి
ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఏదైనా విషయంపై ఆలోచించిన తర్వాతే స్పందించండి. మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. 


వృశ్చిక రాశి 
ఈ రాశి వివాహితులు సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన అంశాలకు సంబంధించి గందరగోళం ఏర్పడవచ్చు. సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో బిజీగా ఉంటారు. స్థిరాస్తికి సంబంధించిన వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది.


ధనస్సు రాశి
ఈ రాశివారు దేవుడిపై భారం వేసి ముందుకు సాగాలి. ఏవో ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగులకు మిశ్రమసమయం. 


Also Read: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!


మకర రాశి
ఈ రాశివారు క్రమశిక్షణకు ప్రాధాన్యతనివ్వాలి. వైవాహిక సంబంధాలలో మాధుర్యాన్ని కాపాడుకోండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పిల్లల భవిష్యత్ లో పురోగతి ఉంటుంది. మీరు మీ భావాలను మీ ప్రేమికుడికి తెలియజేయగలరు.


కుంభ రాశి
ఈ రాశివారు సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం చాలా ముఖ్యం. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు స్వీకరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


మీన రాశి 
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ప్రయాణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఒకరి మాటల కారణంగా మీరు బాధపడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మేయవద్దు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి.