సెప్టెంబరు 19 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యల నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. శత్రుభయం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ప్రమాదకరపనులు చేయొద్దు.
వృషభ రాశి
ఈ రాశి అవివాహితులకు ఈ రోజు వివాహప్రతిపాదన రావొచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లాభాలు పొందుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు బయటపడతారు. కానీ ఎదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.
మిథున రాశి
ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. ఆత్మవిశ్వాసం పెరుుతుంది. రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అనుకోని అతిథులు వస్తారు. ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరగా అలసిపోతారు. ఆదాయం పెరుగుతుంది.
Also Read: ఈ 4 లక్షణాలు ఉన్నవారికి లక్ష్మి కటాక్షం ఎప్పటికీ సాధ్యం కాదు.!
కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడొద్దు. వ్యాపారం బాగా సాగుతుంది. ఎదుటివారి మాటలు విని మీ అభిప్రాయాన్ని మార్చుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహ రాశి
ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరిస్తారు, భాగస్వాముల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సంతోషంగా ఉంటారు. అయితే కెరీర్ గురించి ఏదో చింత ఉంటుంది.
కన్యా రాశి
కన్యారాశివారికి ఈ రోజు శుభదినం. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీ చుట్టూ మిమ్మల్ని ముంచేవారున్నారు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో ఆందోళనలు కొనసాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
తుల రాశి
అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆశించిన ప్రయోజనం పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు ఆశించిన విజయాలు సాధిస్తారు. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు.
వృశ్చిక రాశి
ఏదో ఆందోళన, ఒత్తిడి వెంటాడుతుంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. ఏదో తెలియని భయం మీపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు వద్దు. ఒత్తిడికి దూరంగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ఖర్చులుంటాయి
ధనుస్సు రాశి
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాదికారుల నుంచి సహకారం పొందుతారు. వ్యాపార పనులపై చేసే ప్రయాణం సక్సెస్ అవుతుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. వివాదాల్లో తలదూర్చవద్దు.
Also Read: మీ జీవితం నుంచి ఈ 3 సమస్యలు తొలగించగలిగితేనే విజయం సాధిస్తారు
మకర రాశి
దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితులతో వివాదం జరిగే సూచనలున్నాయి. వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్త. వాహనాలు, యంత్రాలు వినియోగించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీరు సహాయం చేయాలి అనుకుంటే చేయండి కానీ ఇతరుల నుంచి ఆశించవద్దు.
కుంభ రాశి
ఆర్థిక లాభాలు ఉంటాయి. సంతోష సాధనాలు కొనుగోలుచేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కోర్టు పనులు పూర్తవుతాయి. సామాజిక సామరస్యం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది.
మీన రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని కొత్త సమస్యలు రావొచ్చు..ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు శుభదినం.