Horoscope Today 27th October 2023: దీపావళికి ముందే ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం, అక్టోబరు 27 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

అక్టోబరు 27 రాశిఫలాలు

Continues below advertisement

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు శ్రమ పెరుగుతుంది. ఒత్తిడిని నివారించండి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా శాంతిస్తారు. కుటుంబానికి దూరంగా ఉండవలసి రావొచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలను దాచడం మీ సంబంధానికి ఆటంకం కలిగిస్తుందని గుర్తుంచుకోండి.

వృషభ రాశి
ఈ రాశివారి ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. మాటలో కర్కశత్వం ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. 

మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు ఎక్కడికైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆశ నిరాశ మిశ్రమ భావాలు మనస్సులో ఉంటాయి. ఓపిక తగ్గుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పని పరిధి కూడా పెంచుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి మీకు అవసరం అయిన సహకారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు సమసిపోతాయి. 

Also Read: పౌర్ణమి - అమావాస్యకి, చంద్రుడి హెచ్చుతగ్గులకు శివుడే కారణమా!

కర్కాటక రాశి
ఈ రాశివారి వ్యాపారం విస్తరించేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేస్తారు. మానసిక ఇబ్బందులుంటాయి.  జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

సింహ రాశి
ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. గౌరవం పెరుగుతుంది. మీ మనసులో మాటను మనసైనవారికి చెప్పేందుకు మంచి సమయమే. 

కన్యా రాశి
ఉద్యోగులు కార్యాలయంలో తమచుట్టూ మంచి వాతావరణం ఏర్పరుచుకోవాలి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది కానీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. కోపం తగ్గించుకోవాలి. ఉద్యోగంలో పురోగతికి దారులు సుగమం అవుతాయి. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే మెరుగైన ప్రేమ జీవితం కోసం మీ భాగస్వామికి సమయం కేటాయించాలి.

Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!

తులా రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువులో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. మనసులో నిరుత్సాహాన్ని వీడండి. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పరస్పర విభేదాలు కూడా ఉండవచ్చు. వేరేవారి ప్రోత్సాహం కోరుకునే కన్నా మిమ్మల్ని మీరు విశ్వశించాలి. మీ నిజాయితీ మీ జీవిత భాగస్వామికి మీపై నమ్మకం పెంచుతుంది. 

వృశ్చిక రాశి
ఈ రాశివారి తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆలోచించండి. కుటుంబం నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మనసులో మాట బయటకు చెప్పడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. 

Also Read: అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!

ధనుస్సు రాశి
అనవసరమైన వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ రోజు మీరు మీ జీవితంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి మనసులో మాట చెప్పండి. 

మకర రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. కుటుంబం నుంచి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. పిల్లల ఆరోగ్యం విషంయలో జాగ్రత్త. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కానీ మీ సహనం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. 

కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు అనవసర వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఏదో విషయంలో మనసు కలత చెందుతుంది. కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆదాయం తగ్గడం మరియు ఖర్చులు పెరగడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ఆందోళనలను మీ భాగస్వామికి తెలియజేయండి. భవిష్యత్తు ప్రణాళిక, ఆర్థిక లక్ష్యాలు లేదా గృహ బడ్జెట్‌ను రూపొందించుకోవడం గురించి మాట్లాడవచ్చు.

మీన రాశి
ఈ రాశివారి ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. మతపరమైన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహకారం ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి సమయం  కేటాయించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement
Sponsored Links by Taboola