World Cup 2023 Points Table: 2023 ప్రపంచ కప్ 25వ మ్యాచ్‌లో శ్రీలంక వన్‌సైడెడ్‌గా ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత పాయింట్ల పట్టికలో చాలా మార్పులు కనిపించాయి. శ్రీలంక దాదాపుగా టైటిల్ రేసు నుండి ఇంగ్లండ్‌ను తొలగించింది. అలాగే పాకిస్తాన్ సమస్యలను కూడా పెంచింది. విజయం తర్వాత శ్రీలంక పట్టికలో ఐదో స్థానానికి రాగా, ఓడిన ఇంగ్లండ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత శ్రీలంకకు ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. వారి నెట్ రన్ రేట్ -0.205గా ఉంది, వారి తర్వాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు శ్రీలంక విజయం తర్వాత నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పేలవ నెట్ రన్ రేట్ కారణంగా ఆరో స్థానానికి దిగజారింది.
టాప్-4లో మాత్రం మార్పు లేదు
టాప్-4 గురించి మాట్లాడితే ఇందులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆతిథ్య భారత జట్టు 10 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఇద్దరి పాయింట్ల పట్టిక స్థానాల్లో తేడా ఉంది. ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్ +1.142గా ఉంది.
శ్రీలంక నాలుగు పాయింట్లు, -0.205 నెట్ రన్ రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత పాకిస్తాన్ నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.400గా ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, తక్కువ నెట్ రన్‌రేట్ -0.969తో ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లు రెండేసి పాయింట్లతో ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial