2021 ఆగస్టు 21 శనివారం రాశిఫలాలు


మేషం


మీరు ఈరోజు అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. బంధువులతో చర్చలు జరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఓ పనిమీద ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  సోమరితనం వద్దు... ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.


వృషభం


ఈ రోజు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. ఏ పనీ వాయిదా వేయవద్దు. శుభవార్త వింటారు. స్నేహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి.


మిథునం


ఈరోజు మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి మీకు మంచి సమాచారం అందుతుంది. ఒత్తిడికి లోనుకావొద్దు. ఏ పనీ వాయిదా వేయకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇచ్చిన అప్పు తిరిగి పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులు మినహా  సంతోషంగా ఉంటారు. ప్రమాదానికి దూరంగా ఉండండి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.


కర్కాటక రాశి


స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ పురోగమిస్తుంది. ఆఫీసులో ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. అనవసర వివాదాలు వద్దు. ఆర్థిక స్థితి బలహీనంగా ఉంటుంది. మీ పెట్టుబడి ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయండి.


సింహం


ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో మీ పనులన్నీ పూర్తవుతాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొంత పని పెండింగ్ లో ఉండడం ఒత్తిడి కలిగిస్తుంది. గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.


కన్య


ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ ఆరోగ్యాన్ని విస్మరించవద్దు. ప్రయాణం ఆనందంగా ఉంటుంది. విద్యా రంగంలో విజయం సాధిస్తారు. కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రభుత్వ పనిలో అనుకూలత ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోకండి.


తులారాశి


ఏ పని పూర్తి కాకపోవడంతో మీరు ఆందోళన చెందుతారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించబడతాయి. కెరీర్ పురోగమిస్తుంది. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. మీరు స్నేహితులను కలుసుకోవచ్చు. యువతకు శుభవార్తలు అందుతాయి. పిల్లల వైపు ప్రయోజనం ఉంటుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. యాత్రకు వెళ్లాల్సి రావచ్చు. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. ఈరోజు సరదా వాతావరణం ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు.


వృశ్చికరాశి


ఈరోజు కాస్త గందరగోళంగా ఉంటుంది. మీరు కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవసరమైన వారికి సహాయం చేయండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సహాయం పొందుతారు. డబ్బుకు సంబంధించిన పని పూర్తవుతుంది. ఏ వివాదంలోనూ తలదూర్చకండి.


ధనుస్సు


విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దలు ఆశీస్సులు మీపై ఉంటాయి. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారం బాగాసాగుతుంది. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్ కేసులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేయవద్దు.


మకరం


మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ఏదైనా పెద్ద సమస్యను పరిష్కరించడం వల్ల మనశ్సాంతి లభిస్తుంది. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటంది. మీ బాధ్యతలు పూర్తి చేయగలరు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తుల ముందు వ్యక్తిగత విషయాలపై చర్చించవద్దు.


కుంభం


వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ రంగంలో ముందుకు సాగుతారు. కొత్త సమాచారం తెలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం. ఎవరితోనైనా వివాదం జరగొచ్చు. మాటల్లో అసభ్య పదాలు ఉపయోగించవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.


మీనం


ఈరోజు ధన లాభం పొందే అవకాశం ఉంది. మీ ప్రవర్తనతో ప్రశంసలు అందుకుంటారు.  పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణం చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్త వింటారు. శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు.


Also Read: శ్రావణ పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ ప్రతి రోజూ ప్రత్యేకమే


Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!


Also Read: మాంసాహారం తినే గద్దలు చక్కెర పొంగలి మాత్రమే తింటాయి… ఏంటా ఆలయం ప్రత్యేకత…!


Also Read: నువ్వే రాజు - నువ్వే మంత్రి… ఎవరికోసం నువ్వు మారవద్దు: శ్రీశ్రీ రవిశంకర్


Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే