Horoscope Today 2023 August 31st

మేష రాశిఈ రోజు ఈ రాశివారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త భావోద్వేగ సంబంధాలు ప్రారంభమవుతాయి. స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ప్రణాళికల అమలులో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

వృషభ రాశి ఈ రాశివారు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. కెరీర్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచి సమయం. పనిని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేరు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మిథున రాశిఈ రోజు ఈ రాశివారు పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయంపై అభిప్రాయం చెప్పకుండా ఉండడమే మంచిది. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. తొందరపాటు ప్రభావం మీ పనిపై పడుతుంది. 

Also Read: రాఖీ కట్టించుకుని బికారిగా మారిన జమిందార్ - ఈ గ్రామాల్లో రాఖీ అస్సరు జరుపుకోరు!

కర్కాటక రాశిఈ రాశివారు ఓ ముఖ్యమైన పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా ఉంటారు. ఇంటా బయటా మీపై గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. 

సింహ రాశిఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.అనవసర విషయాలపై కోపం తెచ్చుకునే స్వభావాన్ని మార్చుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. చర, స్థిరాస్తుల వివాదాలు సర్దుమణుగుతాయి. 

కన్యా రాశిఈ రాశివారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో వివాదాలు తీరి అంతా సంతోషంగా ఉంటారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. వేరే వ్యక్తులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.  అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Also Read: రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారో తెలుసా!

తులా రాశివ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలి. ఆదాయం బాగానే ఉంటుంది. శత్రువులపై  మీరు పైచేయి సాధిస్తారు. అనారోగ్య సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.  ఉన్నతాధికారులతో అనవసర వాదనలు పెట్టుకోపోవడమే మంచిది. 

వృశ్చిక రాశిఈ రాశివారికి జీవిత భాగస్వామితో వివాదాలు జరిగే అవకాశం ఉంది. అనవసర సమావేశాలకు, చర్చలకు దూరంగా ఉండాలి. కార్యాలయంలో వ్యక్తుల నుంచి ఎక్కువగా ఆశించవద్దు. మీరు చేయాలనుకున్న పనిని మీ ప్రణాళిక ప్రకారం పనిచేయడం మంచిది. ఎవ్వరిపైనా అంచనాలు పెంచుకోవద్దు. 

ధనుస్సు రాశిఈ రాశివారు పెండింగ్ లో ఉన్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేయాలనే ఆలోచన చేస్తారు. ముఖ్యమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. 

Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!

మకర రాశిఈ రోజు మీరు మీ ఆలోచనలను మీ కుటుంబ సభ్యులకు చెప్పడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశి వ్యాపారులు కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ పనిలో ఆటంకాలు ఉండవచ్చు. ప్రాణాయామంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం

కుంభ రాశిఈ రాశివారు కొత్త ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. అత్యుత్సాహంతో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

మీన రాశిఈ రాశివారు జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. భావోద్వేగానికి లోనై  ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ జీవిత భాగస్వామి గురించి కొంత ఆందోళన ఉంటుంది. దాంపత్య సంతోషం తగ్గుతుంది.

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.