Horoscope Today 2023 August 24th


మేష రాశి
ఈ రాశివారు ఇంటి వ్యవహాలను, కార్యాలయ వ్యవహారాలను బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది పడతారు. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ సమయం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది.


వృషభ రాశి
ఈ రాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. నూతన పెట్టుబడులు బాగా కలిసొస్తాయి. జీవిత భాగస్వామిపై నమ్మకం ఉంచండి.  కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


మిథున రాశి
ఈ రాశివారు ఎదుటివారితో మంచిగా ప్రవర్తించాలి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విలాసవంతమైన వనరులలో పెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మీరు చేసే పనిని నిరూపించుకోవడంలో సక్సెస్ అవుతారు.


Also Read: శివుడిని పంచభూతాలకు అధిపతి అంటారెందుకు!


కర్కాటక రాశి
ఈ రాశివారు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. ఇతరుల నుంచి గొప్ప  స్ఫూర్తిని పొందుతారు. మతపరమైన ఆలోచనల ప్రభావం మీపై ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. మీ విధానాలు, పద్ధతులు చాలా లాజికల్ గా ఉంటాయి.


సింహ రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కలిసొస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది 


కన్యా రాశి
ఈ రాశివారికి ఉత్తమ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో మీకు అనకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు


Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు


తులా రాశి
మీ జీవిత భాగస్వామితో మీ సమన్వయం చాలా బాగుంటుంది. మార్కెటింగ్ , విక్రయాలకు సంబంధించిన రంగంలో మీ పనితీరు బలంగా ఉంటుంది. పై అధికారులతో మీ ప్రవర్తన మెరుగ్గా ఉంచుకోండి.  చిన్న చిన్న సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త ధన వనరులు ఏర్పడతాయి.


వృశ్చిక రాశి 
ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం. పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  మీ మాటతీరు ప్రశంసలు అందుకుంటుంది. కొత్త పధకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.  మీరు అనుభవజ్ఞుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.


ధనుస్సు  రాశి
ఈ రాశివారు ఈ రోజు నూతన వస్తువులు  కొనుగోలు చేస్తారు. పిల్లల  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సబార్డినేట్ ఉద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు.  రుణ లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు


మకర రాశి
ఈ రాశివారు రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. రచనా రంగంలో ఉన్నవారు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. 


కుంభ రాశి
ఈ రాశి విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేధోపరమైన పనుల్లో పాల్గొంటారు. కొన్ని రహస్య విషయాలను అధ్యయనం చేస్తారు. అనుకున్న ప్రణాళికలు సమయానికి పూర్తిచేస్తారు. బంధుమిత్రుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులు పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు. 


మీన రాశి 
ఈ రాశి వ్యాపారులు నూతన ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు ఇదే మంచి సమయం. మనసులో ఏదో నిర్లిప్తత ఏర్పడవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది.