Horoscope Today 2023 August 20th


మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. మీకు అంత అనుకూల ఫలితాలు లేనందున కొత్తగా ఏ పనులూ ప్రారంభించకపోవడమే మంచిది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.దీర్ఘ కాలిక వ్యాధులబారి నుంచి బయటపడతారు. అవివాహితులు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. 


వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. పిల్లల వలన ఆనందాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి.  తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రయాణాలనువాయిదా వేసుకోవడమే మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.  పాత వివాదాల్లో తల దూర్చకండి. వ్యాపార భాగస్వామి నుంచి మీరు దూరమయ్యే అవకాశముంది. . 


మిథున రాశి
మిధున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం లాభ సాటిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, స్థానచలనం ఆలస్యం కావచ్చు. సోమరితనం కారణంగా, ఈ రోజు మీరు మీ పనిని సరైన టైమ్ లో పూర్తి చేయలేరు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాన్నీ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. 


Also Read: శ్రావణమాసంలో అష్టాదశ శక్తిపీఠాల సందర్శనం శుభకరం - మీరెన్ని దర్శించుకున్నారు!


కర్కాటక రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు ధైర్యం పెరుగుతుంది. రోజువారీ ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఈ రోజు మీ పిల్లల నుంచి శుభ వార్త అందుకుంటారు.  మీ మాటలను నియంత్రించడం అవసరం. 


సింహ రాశి
ఈ రాశివారు అపరిచిత వ్యక్తులను నమ్మడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆరోగ్యం మునుపటి కన్నా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఎప్పటి నుంచో వసూలు కాని రుణాలు ఈ రోజు పొందుతారు. 


కన్యా రాశి 
ఈ రోజు ఈ రాశి వారికి  ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగుసేందుకు మంచి రోజు. మీ పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. రోజంతా ప్రశాంతంగా ఉంటారు,  మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. కార్పోరేట్ రంగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. 


తులా రాశి 
ఈ రాశి వారు అధిక ఖర్చుల వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. వ్యాపారం బాగా  వృద్ధిచెందుతుంది. కొత్త పరిచయాలు  ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారంలో కొంత నష్టం వచ్చినా దానిని అధిగమిస్తారు. పని విషయంలో కాస్త ఓపికగా వ్యవహరించండి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కలిగి ఉండాలి.


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆనందం, వారికి ఆదాయం - ఆగష్టు 21 to 27 వారఫలాలు


వృశ్చిక రాశి 
ఈ రోజు మీ మనోభీష్టం నెరవేరుతుంది. వైద్య రంగంలో ఉన్నవారు వ్యాపారంలో లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విభేదాలు తలెత్తే అవకాశముంది. కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది. ఈరోజు మంచి కార్యాచరణలో భాగం అవుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు వింటారు. 


ధనుస్సు రాశి 
ఉద్యోగస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. వ్యాపార వృద్ధిపై శ్రద్ధ వహించండి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 


మకర రాశికి
ఈ రోజు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ పిల్లల వైపు నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది.  వ్యాపారస్తులకు మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి వాటిని వినియోగించుకోండి.  కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.


కుంభ రాశి 
ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తికావు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.  వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేయవద్దు. ఆశించిన లాభాలు కూడా రావు. ఆకస్మిక ఖర్చులు వలన ఇబ్బంది పడతారు . ఉద్యోగులు మీరు చేసే పనిపై శ్రద్ధ వహించండి. ఈరోజు కష్టపడి పనిచేసినా శ్రమకి తగిన ఫలితం ఉండదు.


మీన రాశి 
ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలున్నాయి జాగ్రత్త. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. ప్రేమికులు పెళ్లిదిశగా నిర్ణయం తీసుకునేందుకు ఇదే మంచిసమయం. ఆరోగ్యం బావుంటుంది. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.