2021 సెప్టెంబరు 18 శనివారం రాశిఫలాలు
మేషం
మేషరాశివారికి ఈ రోజంతా శుభసమయే. బంధువులు,స్నేహితులను చాలాకాలం తర్వాత కలుస్తారు. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. మీరు చేసే ప్రతిపనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దు. శత్రువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృషభం
తెలివైన వ్యక్తితో కొన్ని విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఒకరి నుండి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అధిక ఒత్తిడికి లోనుకాకుండా ప్లాన్ చేసుకోండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందండలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. వృద్ధులతో ఏదో విషయంలో విభేదాలు తలెత్తవచ్చు. ఒత్తిడి తీసుకోవద్దు. మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆఫీసులో పెద్ద బాధ్యత వహిస్తారు.
కర్కాటక రాశి
మతపరమైన కార్యక్రమాల్లో భాగమవుతారు.బంధువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాలు చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆఫీసు పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థికి లావాదేవీలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
Also read: బిగ్ బాస్ ఎపిసోడ్ 13: ఇంతులతో శ్రీరామ్.. బంతులతో బిగ్ బాస్.. హమీదాకు అంతా ఫిదా!
సింహం
శుభవార్త వింటారు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. చేపట్టే ప్రతిపనిలోనూ భాగస్వామి సహకారం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శత్రువు చురుకుగా ఉంటాడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అపరిచితులకు రుణాలు ఇవ్వొద్దు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు.
కన్య
అధిక పని ఒత్తిడి కారణంగా నీరసంగా ఉంటారు. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి.ఈ రోజు కొన్ని పనులపై కొత్త వ్యక్తులను కలుస్తారు . ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. అనవసర వాదనలు పెట్టుకోవద్దు.
తులారాశి
మీరు ఓ పనిపై ప్రయాణం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ధన లాభం ఉంటుంది. కెరీర్ సంబంధిత ప్రయోజనాలను పొందుతారు. బంధువుల నుంచి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. ఏదైనా ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.
వృశ్చికరాశి
ఈ రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారస్తులకు శుభసమయం. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ వ్యవహారంలో ఓ అడుగు ముందుకుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి.
Also Read: ఎందుకు చంపుతోంది? తమన్నాను విలన్‌గా చూసి చిన్నారి ఏడుపు.. వీడియో ట్వీట్ చేసిన నితిన్
ధనుస్సు
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో కొత్తగా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. స్థిరాస్తి పెరుగుతుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ప్లాన్ సత్ఫలితాలనిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. గౌరవం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఎవరితోనైనా వాదన జరగవచ్చు.
మకరం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యంలో ఒడిదొడుకులు ఉంటాయి. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఎవరితోనూ వివాదాలు వద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. యువత కెరీర్‌కు సంబంధించి ఓ అడుగు ముందుకేస్తారు. ఈ రోజు మీరు చాలా సానుకూలంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.
కుంభం
ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. విద్యార్ధులు విజయం సాధిస్తారు. స్నేహితుడి భాగస్వామ్యంతో పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. దూర ప్రయాణాలు చేయవద్దు. వివాదాల్లో తలదూర్చకండి. ప్రతి పనిలో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.
మీనం
ఆఫీసులో కొత్త బాధ్యతను పొందుతారు. కుటుంబ బాధ్యత మరింత పెరుగుకుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు గణనీయమైన లాభాలు ఇస్తాయి. మీరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అనవసర ఒత్తిడి తీసుకోకండి. పనులు వాయిదా వేయవద్దు.
Alos Read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..
Alos Read: కాంగ్రెస్ వస్తే యువకులే బ్రాండ్ అంబాసిడర్లు.. 19 నెలలు పని చేయండి: రేవంత్ రెడ్డి