Horoscope 9th September 2022: ఈ రోజు వృశ్చిక రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. తులా రాశివారికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సెప్టెంబరు 9 శుక్రవారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
ఈ రోజు వ్యాపార పరంగా చాలా ప్రత్యేకమైన రోజు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి
వృషభ రాశి
మీకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం, సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు తమ భాగస్వాములను ఓ కంట గమనిస్తూ ఉండాలి. కోపాన్ని తగ్గించుకోండి.
మిథున రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
Also Read: రాక్షసరాజును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం!
కర్కాటక రాశి
మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. కార్యాలయంలోని సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు.
సింహ రాశి
సింహ రాశివారు ఈ రోజు మాట విషయంలో సంయమనం పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు కన్యా రాశి వ్యాపారులకు లాభిస్తుంది. ఉద్యోగస్తులు తమ తెలివితేటలతో పనులు పూర్తిచేస్తారు. వ్యక్తిగత సంబంధాలలో ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
తులా రాశి
తులా రాశివారు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కళలు మరియు వినోద రంగాలకు సంబంధించిన వ్యక్తులు విజయాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు,వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు అనూహ్యంగా డబ్బు చేతికందుతుంది. కుటుంబంలో ఏదైనా శుభవార్త ద్వారా సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త పనులేవీ ఈ రోజు ప్రారంభించవద్దు.
మకర రాశి
ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కలుపుకునేందుకు ప్రయత్నించండి. అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. టెన్షన్ తగ్గుతుంది. కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి.
Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే
కుంభ రాశి
ఎప్పటి నుంచో వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. కార్యాలయంలో మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చు. వ్యాపారంలో స్నేహితుల మద్దతు లభిస్తుంది.
మీన రాశి
ఈ రాశివారికి అత్తమామల వైపు నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ధ్యానం మరియు యోగాతో మీ కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించండి. ప్రేమికుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి.