7th January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉండిపోయిన పనిని ఈరోజు పూర్తిచేస్తారు. మీ వ్యక్తిత్వం మెచ్చి కొందరు మీకు అనుకూలంగా మార్చవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితం


వృషభ రాశి 
సరదా పర్యటనలు, సామాజిక చర్చలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఖర్చుచేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. మొండితనం తగ్గించుకోకుంటే మీ కారణంగా ఇతరులు బాధపడడం మాత్రమే కాదు మీరుకూడా చాలా నష్టపోతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి.


మిథున రాశి
ఈ రాశి వ్యాపారులు ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. భాగస్వామి సూచన మీకు చాలా ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా ఆర్థిక లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది.


కర్కాటక రాశి
మీలో సృజనాత్మకతను వెలికితీయండి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపార యాత్ర ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు మీకు కలిసొస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. 


Also Read: వేదాల్లోనూ నార్త్ కే ఎందుకు ఎక్కువ ప్రయార్టీ, కాలాల్లోనూ ఉత్తరాయణమే పుణ్యకాలం ఎందుకంటే!


సింహ రాశి
ఈ రోజు మీ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రస్తుత పరిస్థితితో మీరు సంతృప్తి చెందడం మంచిది. ఆర్థిక సంబంధిత విషయాలపై మరోసారి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి..మొదట్లోనే వాటిని సాల్వ్ చేసుకోవడం మంచిది


కన్యా రాశి
ఏకధాటిగా పనిచేయవద్దు..మధ్య మధ్యలో కొంత విరామం తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులను కలుస్తారు. 


తులా రాశి
కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు..మీరు అనుకున్నవి నెరవేరుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఏ అవకాశాన్నీ వదులుకోవద్దు. ఎవ్వరి సహాయాన్ని అర్థించవద్దు. 


వృశ్చిక రాశి
మీ మాటలకు అందరూ ప్రభావితమవుతారు. కొత్తవ్యక్తులతో స్నేహం చేస్తారు. కుటుంబంలో మీ ప్రియమైన వారిగురించి ఆలోచిస్తారు. రాయడం, చదవడంపై ఆసక్తి కలిగి ఉంటారు. కొంచెం తక్కువగా మాట్లాడటం మీకు మంచిది


Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!


ధనుస్సు రాశి
ఈ రోజు ధనస్సు రాశివారు ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. నిర్మాణ పనులు చేస్తున్నవారికి ఈ రోజు ప్రయోజనం ఉంటుంది.  పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. కెరీర్లో విజయం సాధిస్తారు. స్నేహితులను కలిసేందుకు వెళతారు.


మకర రాశి 
అనారోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి. అదనపు ఆదాయం కోసం మీలో  సృజనాత్మకను వెలికితీయండి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 


కుంభ రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు. పాత వివాదాలను పరిష్కరించడానికి,  పరిస్థితిని  అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులను ఇది మంచి సమయం.


మీన రాశి
కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.