తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జరిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అదనంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జిల్లాలవారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు..
➥ ఆదిలాబాద్ పరిధిలో 9,178 మంది అభ్యర్థులు హాజరుకాగా 4,780 మంది అర్హత సాధించారు.
➥ సైబరాబాద్ పరిధిలో 21,639 మంది అభ్యర్థులు హాజరుకాగా 9,638 మంది అర్హత సాధించారు.
➥ హైదరాబాద్ పరిధిలో 21,166 మంది అభ్యర్థులు హాజరుకాగా 9,638 మంది అర్హత సాధించారు.
➥ కరీంనగర్ పరిధిలో 19,209 మంది అభ్యర్థులు హాజరుకాగా 11,515 మంది అర్హత సాధించారు.
➥ ఖమ్మం పరిధిలో 21,809 మంది అభ్యర్థులు హాజరుకాగా 12,567 మంది అర్హత సాధించారు.
➥ మహబూబ్ నగర్ పరిధిలో 21,600 మంది అభ్యర్థులు హాజరుకాగా 15,143 మంది అర్హత సాధించారు.
➥ నల్గొండ పరిధిలో 23,554 మంది అభ్యర్థులు హాజరుకాగా 12,124 మంది అర్హత సాధించారు.
➥ నిజామాబాద్ పరిధిలో 10,136 మంది అభ్యర్థులు హాజరుకాగా 5,311 మంది అర్హత సాధించారు.
➥ రాచకొండ పరిధిలో 21,224 మంది అభ్యర్థులు హాజరుకాగా 9,698 మంది అర్హత సాధించారు.
➥ సంగారెడ్డి పరిధిలో 7,264 మంది అభ్యర్థులు హాజరుకాగా 2,989 మంది అర్హత సాధించారు.
➥ సిద్ధిపేట పరిధిలో 8,742 మంది అభ్యర్థులు హాజరుకాగా 4,360 మంది అర్హత సాధించారు.
➥ వరంగల్ పరిధిలో 21,585 మంది అభ్యర్థులు హాజరుకాగా 12,387 మంది అర్హత సాధించారు.
Also Read:
GAIL Recruitment: గెయిల్‌లో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 277 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభకాగా.. జనవరి 20తో దరఖాస్తు గడువు ముగియనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్‌లో 88 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, వివరాలు ఇలా!
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మెయిల్ ద్వారా జనవరి 14, స్పీడ్ పోస్టు ద్వార 19వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..