Horoscope Today 28 May 2024 : మే 28 రాశిఫలాలు

  


మేష రాశి
ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.  మీ వ్యక్తిగత జీవితంలో మూడోవ్యక్తి జోక్యాన్ని సహించవద్దు. 


వృషభ రాశి
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తి జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన బాధ్యతలు తీసుకోవడంలో వెనుకాడరు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. వాహనం నిర్వహణకు డబ్బు వెచ్చించాల్సి రావచ్చు.  సృజనాత్మకతతో చేసే పని ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది.


మిథున రాశి
ఈ రోజు నూతన పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. వృత్తి జీవితంలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి. కెరీర్ వృద్ధి అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది.  కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితం,వైవాహిక జీవితం బావుంటుంది. 


కర్కాటక రాశి
ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఆఫీసులో మీ పనితీరు బాగానే ఉంటుంది. తల్లిదండ్రులనుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నూతన గృహానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో కలసి వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. 


సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగం , వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. వృత్తి జీవితంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో  విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కొత్త ఫ్లాట్ లేదా ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు.  


కన్యా రాశి
ఈ రోజు మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. పనుల్లో జాప్యం ఉంటుంది. ఆస్తి సంబంధిత వివాదాల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు.  మీరు మీ భాగస్వామిని ఆశ్చర్యపరిచేలా ప్లాన్ చేసుకోవచ్చు.  


తులా రాశి
తులా రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలపై కొంత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. కుటుంబానికి సమయం కేటాయించాలి. పిల్లలకు కొంత సమయం కేటాయించాలి నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.  ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మీ భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి.  


వృశ్చిక రాశి
ఈ రోజు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషించండి. అంకితభావంతో చేసే పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఈ రోజు మంచి రోజు. బంధువులతో కలిసి కొన్ని కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. 


ధనస్సు రాశి
ఈ రోజు వృత్తిపరమైన జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఈ రోజు అనుకూలం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. 


మకర రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలపై కాస్త శ్రద్ధ వహించండి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. కెరీర్ సవాళ్లను అధిగమించేందుకు సీనియర్ల సహాయం అడగేందుకు వెనుకాడవద్దు. ఈ రోజు సామాజిక హోదా  పెరుగుతుంది. మీ కెరీర్ లక్ష్యాలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామితో గత సమస్యలను ఎక్కువగా చర్చించకండి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. 


కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారు తమ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో విజయం సాధించేందుకు చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి.  స్నేహితుల మద్దతుతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉన్నాయి. కొందరికి కెరీర్‌లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన ఆస్తి పత్రాలను ఈరోజు సురక్షితంగా ఉంచండి. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మీ భాగస్వామికి మద్దతు ఇవ్వండి. 


మీన రాశి
ఈ రాశివారు అన్నిరంగాల్లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.