Rahu Impact On 12 Zodiac Signs: జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో ఎన్నో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే రాహువు శుభ స్థానంలో ఉంటే అదృష్టం మామూలుగా ఉండదు. రాహు గ్రహం దాదాపు 18 నెలల పాటు ఒక రాశిలో ఉంటుంది.  2025 మే వరకూ రాహువు మీన రాశిలో సంచరిస్తుంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి వృద్ధిని సూచిస్తుంది.  
 
మేష రాశి
రాహువు  సంచారం మేషరాశి వారికి మిశ్రమ ప్రభావాలను ఇస్తుంది.   విదేశాలకు సంబంధించిన మీ పనిలో కొంత విజయాన్ని పొందుతారు.   పాత వివాదాలు మళ్లీ తలెత్తడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది.  ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.. శత్రువులపై పైచేయి సాధిస్తారు.
 
వృషభ రాశి
మీనరాశిలో రాహువు సంచారం వృషభ రాశి వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు బావుంటాయి. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. 


Also Read: రాశిఫలాలు (21/05/2024) ఈ రాశులవారు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది!


మిథున రాశి
రాహువు  సంచారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ స్థలాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం.  వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని పెంచే కొన్ని వర్క్ ఆర్డర్ లు పొందే అవకాశం ఉంది. 
 
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రాహు సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు మీ పని, ఉన్నత విద్య మరియు వ్యాపారంలో ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటారు కానీ వాటిని అధిగమిస్తారు. మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువులకోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చేపట్టిన పనులను కష్టపడి పూర్తిచేస్తారు.  


సింహ రాశి 
రాహువు సంచారం సింహంరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంపదలో పెరుగుదల ఉంటుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. రాహువు ప్రభావం వల్ల  ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది 


కన్యా రాశి 
మీన రాశిలో రాహువు సంచారం కన్యారాశివారి ప్రేమ సంబంధాలు, వ్యాపారం, వృత్తిపరమైన అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీరు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త..


తులా రాశి
తులారాశి వారికి ఈ రాహు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న గందరగోళ పరిస్థితి తొలగిపోతుంది.  వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు సమసిపోతాయి. జాయింట్ వెంచర్‌లో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. పాత అప్పులను తిరిగి చెల్లించే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో  ప్రమోషన్‌ను  పొందే అవకాశం ఉంది.


వృశ్చిక రాశి
2025 సంవత్సరం వరకు రాహువు మీనరాశిలో సంచరించడం.. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలన్నాయి. ఉద్యోగం , వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. కానీ ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకోవద్దు. డబ్బును తెలివిగా ఖర్చుచేయండి. 


Also Read: మే 21 నృసింహ జయంతి - సంధ్యాసమయం చాలా ప్రత్యేకం!
 
ధనుస్సు రాశి
రాహువు  సంచారం ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సహనం తగ్గుతుంది. భూమికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు కార్యాలయంలో రాజకీయాలు మరియు కుట్రలకు దూరంగా ఉండాలి.  తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది


మకర రాశి
రాహువు సంచారం మకర రాశి ఉద్యోగులకు శుభఫలితాలను ఇస్తోంది. మీ పరిచయాలు పెరుగుతాయి...నూతన ఆదాయ మార్గాలను సూచిస్తుంది.  కుటుంబంలో ఉండే పాతవివాదాలు పరిష్కారం అవుతాయి. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 
 
కుంభ రాశి
కుంభ రాశి వారికి  రాహు సంచారం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మాట్లాడేవిధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.  


మీన రాశి
రాహువు సంచారం మీ రాశిలోనే కావడంతో ఈ సమయంలో మీకు సహనం తగ్గుతుంది. పనిలో తొందరపాటు కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలలో సంతకం చేసేముందు జాగ్రత్తగా చదువుకోవాలి. అయితే మీ ఆత్మవిశ్వాసానికి తోడు అదృష్టం కలిసొస్తుంది.  జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.  


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.