Telangana ITI Admissions 2024: తెలంగాణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో 2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులు 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై 14 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల వయసు కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 


ఆర్టీసీ కళాశాలల్లో అప్రెంటిస్‌షిప్‌ అవకాశం..
వరంగల్‌, హైదరాబాద్‌ నగరాల్లోని టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌ (రెండేళ్లు), మెకానిక్‌ డీజిల్‌ (ఏడాది), వెల్డర్‌ (ఏడాది), పెయింటర్‌ (రెండేళ్లు) ట్రేడ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌లకు పదోతరగతి అర్హత కాగా.. మిగతా ట్రేడ్‌లకు 8వ తరగతి విద్యార్హతగా నిర్ణయించారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యార్థులు హైదరాబాద్ ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ద్వారా సంప్రదించవచ్చు.


వివరాలు..


* ఐటీఐ ప్రవేశాలు (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్)


ఐటీఐ ట్రేడ్లు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్/ సివిల్) ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రిండర్), ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, డ్రెస్ మేకింగ్, ఫ్యాషన్ డిజైన్ & టెక్నాలజీ, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఐవోటీ టెక్నీషియన్, మెకానిక్ ఆటో బాడీ పెయింటింగ్, మెకానిక్ ఆటో బాడీ రిపేర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, మెకానిక్ డీజిల్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, సీవింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), స్టెనోగ్రాఫర్ & సెక్రటేరియల్ అసిస్టెంట్, డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, పెయింటర్, రేడియాలజీ టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్ & ఏసీ టెక్నీషియన్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కమ్ ఆప్ టెస్టర్, హాస్పిటల్ హౌస్ కీపింగ్, మెకానిక్ (మోటార్ వెహికిల్), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA).


అర్హత: 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.08.2024 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 


ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 10.06.2024.


Notification


Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..