Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రాశి అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. కష్టపడి పని చేస్తే అందుకు తగిన ఫలితం తప్పనిసరిగా పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. మీ ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఓ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రాశి వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం వెయిటింగ్ తప్పదు. ఆస్తి నుంచి లాభాలు పొందుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం.
మిథున రాశి
ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొందరికి వారసత్వంగా ఆస్తి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పట్ల మొరటుగా ప్రవర్తించవద్దు. ఈ రాశి విద్యార్థులు చదువులో రాణిస్తారు.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!
కర్కాటక రాశి
ఈ రాశివారికి గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కీర్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. నూతన ఆస్తులపై పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఎవరి భావాలను అగౌరవపరచొద్దు.
సింహ రాశి
ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు కలిసొస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఎక్కడున్నా మీరు సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండాలని ఆలోచిస్తారు.
కన్యా రాశి
ఖర్చులు తగ్గించుకోవాలంటే ఆర్థిక నిర్వహణ అవసరం. అవసరమైతే ఆర్థిక సలహాదారునుంచి సలహాలు తీసుకోండి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పులు ఇవ్వొద్దు..తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటారు.
తులా రాశి
ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయించాలి. కొత్త ప్రణాళికల గురించి స్నేహితులతో చర్చించవచ్చు. మీ వ్యాపారంలో పెట్టుబడి అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఉద్యోగులు పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.
వృశ్చిక రాశి
ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్య నిర్వహణ కోసం ఆలోచిస్తారు. గుండెకు సంబంధించిన సమస్యలున్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లోపం ఉండనివ్వవద్దు.
Also Read: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ఆస్తి కొనుగోలుకు ఇదే సరైన సమయం. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూల ఫలితాలనిస్తుంది. ఇంట్లో వాతావారణం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆసక్తి చూపిస్తారు.
మకర రాశి
చేతిలో డబ్బు లేకపోవడంతో ఆగిపోయిన పనులు ఈ రోజు తిరిగి ప్రారంభమవుతాయి. సృజనాత్మక పనిలో చాలా చురుకుగా ఉంటారు. కుటుంబ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులు పనిలో వేగాన్ని కొనసాగిస్తారు.నూతన ఆస్తులు కొనుగోలులో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం ఇది. ప్రేమ సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి.
కుంభ రాశి
మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. వృత్తిపరమైన రంగంలో మీ సీనియర్లను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపుతారు. భూమి క్రయ విక్రయాలలో నిమగ్నమైన వారికి ఈ రోజు మంచిది.
Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!
మీన రాశి
ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. స్థిరాస్తులలో పెట్టుబడులు పెడతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరమైన ఆలోచనలు మనసుపై ఒత్తిడిని కలిగిస్తాయి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.