AP Latest News: ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఈనెల 29న కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. గతంలో తన వారాహి యాత్రకు ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో మరోసారి ఆలయానికి వస్తున్నారు. వారాహి మాత దీక్షలో ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి అంజన్నను దర్శించుకుని ఉన్నారు. 


ఆ ఘటనతో మరింత నమ్మకం
గత ఏడాది 2023లో వారాహి వాహనానికి పూజతో పాటు కొండగట్టు అంజన్నను దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు అంజన్న ఇలవేల్పుగా అత్యంత ఆరాధ్య దైవంగా భావించే  పవన్ కళ్యాణ్ ఏ నూతన పనిని ప్రారంభించిన కొండగట్టు అంజన్న దర్శించిన తర్వాతనే పనులను ప్రారంభిస్తారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే విద్యుత్ తీగలు తగిలి కొంతవరకు ప్రాణాపాయం తప్పడంతో తన ప్రాణాలు నిలవడానికి కారణం కొండగట్టు అంజన్న అనే కారణమని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.


రాజకీయంగా కూడా ఏపీలో ప్రచారం కొనసాగించడానికి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి దర్శించుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారాహి మాత పూజలో ఉన్నారు. ఇదే సందర్భంలో ఏపీలో కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా విజయం సాధించారు. అధికారంలో కూడా భాగస్వాములు కావడంతో మరోసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు ఉన్న సందర్భంలో తెలంగాణలో కూడా బీజేపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ తో కలిసి కొండగట్టు అంజన్న దర్శించుకుంటారని తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జనాలు కదిలి వచ్చే అవకాశం ఉంది. ఓవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు.. మరోవైపు బీజేపీ శ్రేణులు వీరంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి కొండగట్టు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కొండగట్టు ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాగా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారికంగా స్వాగతం పలికేందుకు పోలీసులు కూడా సెక్యురిటీ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అయితే మరొకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని అనంతరం కరీంనగర్లోని కొంతమంది రాజకీయ నేతలతో కొన్ని అంశాలపై చర్చిస్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.