Today Horoscope Telugu - రాశిఫలాలు (25-05-2024)


మేష రాశి
ఈ రోజు మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తుంది. ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.


వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో అనుకోని మార్పులొస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితంలో ముఖ్యమైన విజయాలు సాధిస్తారు.  పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. 


మిథున రాశి
ఈ రోజు  మీకు అదృష్టం కలిసొస్తుంది.  ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత , వృత్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు చేసే పని సంతృప్తికరమైన ఫలితాలనిస్తుంది


Also Read: వృషభ రాశిలోకి బుధుడు - ఈ రాశులవారికి ఆర్థికంగా అదృష్టమే కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవు!


కర్కాటక రాశి
ఈ రోజు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. వృత్తి జీవితంలో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. దీని వల్ల జీవితంలో చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  వ్యాపారంలో లాభం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.  


సింహ రాశి
ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆఫీసులో బాస్ మీ పనిని ప్రశంసిస్తారు.  నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆస్తికి సంబంధించి కుటుంబంలో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. 


కన్యా రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీ పరిచయాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా విశ్వసించకండి.


Also Read: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!


తులా రాశి
ఈ రోజు అదృష్టం మీకు ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి.  పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. చేపట్టే పనులకు మీ జీవితభాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. 


వృశ్చిక రాశి
మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు.  మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విజయం సాధించేందుకు కృషి చేయండి. ఇది కుటుంబ జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. పిత్రార్జిత ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. మీ పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కెరీర్‌లో సక్సెస్ అవుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. 


ధనస్సు రాశి
ఈ రోజు  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో పరిచయాలు పెరుగుతాయి...ఇది కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలను కూడా అందిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. జీవనశైలి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలోని బాధ్యతలను తెలివిగా నిర్వహించండి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.   కొత్త ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


కుంభ రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. వృత్తి జీవితంలో కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ సమేతంగా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 


మీన రాశి
వృత్తిపరమైన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి.  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జరిగిపోయిన విషయాలగురించి  మీ భాగస్వామితో ఎక్కువగా చర్చించవద్దు. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.