Today Horoscope Telugu - రాశిఫలాలు (23-05-2024)


మేష రాశి


మేష రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ వృత్తి జీవితంలో మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వొద్దు. ఇది మీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  రోజంతా బిజీగా ఉంటారు. 


వృషభ రాశి


ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు మంచిరోజు. వృత్తి పరమైన పనులు బాధ్యతాయుతంగా నిర్వహించండి. ఆర్థికంగా ఈరోజు మంచిరోజు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. 
 
మిథున రాశి
ఈ రోజు మిథునరాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. డబ్బు సంబంధిత విషయాల్లో తెలివిగా వ్యవహరించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది.  


Also Read: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం, రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చిందో తెలుసా!


కర్కాటక రాశి 
కర్కాటక రాశివారికి అనుకూలమైనరోజు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. కొంత భయంగా ఉన్నప్పటికీ రిస్క్ తీసుకోవడం అవసరం అని గుర్తించండి. మీ సృజనాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. 


సింహ రాశి


ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి.  


కన్యా రాశి


కన్యా రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే రిస్క్ దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తితో లోతుగా కనెక్ట్ అవ్వడానికి ఇది అద్భుతమైన రోజు. ఆర్థిక సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.


తులా రాశి
కుటుంబానికి సమయం కేటాయించాలి. అప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొందరు రాజకీయప్రయోజనాలు పొందుతారు. 


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


వృశ్చిక రాశి


కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడవద్దు. ఉద్యోగులు పనితీరుతో మంచి గుర్తింపు పొందుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది..ఖర్చులు నియంత్రించండి. 


ధనస్సు రాశి


ఆర్థిక సమస్యలనుంచి బయటపడేందుకు మీ భాగస్వామిని సంప్రదించండి. కార్యాలయంలో అంకితభావంతో పనిచేయండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదృష్టం కలిసొస్తుంది. 


మకర రాశి


ఈ రోజంతా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. కుటుంబంలో కొంత గందరగోళం ఉంటుంది కానీ పరిస్థితులు మెరుగుపడతాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు కలిసొస్తాయి.  


కుంభ రాశి


ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీ అభిరుచులను కొనసాగించేందుకు ప్రయత్నించండి. సవాళ్లకు భయపడొద్దు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేముందు ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోవచ్చు.  సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. 


మీన రాశి


ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు తగ్గించాలి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ఈరోజు మీరు మరింత ఉపయోగపడుతుంది.  


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.