Horoscope Today 17th June 2023: జూన్ 17 మీ రాశిఫలితాలు
మేష రాశి
ఈరోజు మీరు పని విషయంలో చలాకీగా ఉండరు అందుకే పనులు మంద కోడిగా సాగుతాయి. ఎవరితోను అనవసర వాదనలు చేయకండి. మీ మాటలపై నియంత్రణ లేకపోవడం సమస్యగా ఉంటుంది. చర్చలకు గొడవలకు దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కొన్ని పనుల్లో అనవసర ఖర్చు ఉంటుంది. ఆహారం, పానీయాలపై నియంత్రణ ఉండాలి.
వృషభ రాశి
ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. బట్టలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు , వినోదం కోసం ధనాన్ని వెచ్చిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లి విరుస్తాయి. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.
మిథున రాశి
ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదం జరగవచ్చు. టెన్షన్ కు లోనవుతారు . బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు, ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విందు వినోదాలకు ఖర్చు చేస్తారు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.
కర్కాటక రాశి
వ్యాపారానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచిది. వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఆదాయ వనరుల పెరుగుదలతో సంతోషంగా ఉంటారు. ఆత్మ సంతృప్తి ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణ, దాంపత్య యోగం ఉంది. దంపతులు ఇద్దరు కలిసి శుభకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారు.
సింహ రాశి
ఉద్యోగస్తులకు లాభం ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత శుభకరం. మీరు మీ కార్యాలయంలో ఆధిపత్యాన్ని పొంది ఇతరులను ప్రభావితం చేస్తారు. మీ విశ్వాసం, దృఢమైన సంకల్పం వలన పనులు సులభంగా పూర్తి చేస్తారు. పెద్దమనుషులను కలుస్తారు. పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. పెద్దల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
కన్యా రాశి
ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేస్తారు. ఆకస్మిక తీర్థయాత్రలు ఉంటాయి. విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది. కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగకండి. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. బంధువుల రాక ఉండవచ్చు.
తులా రాశి
ఈ రోజు మీరు అకస్మాత్తుగా ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. ఆధ్యాత్మిక విజయాల కోసం ప్రయత్నిస్తారు. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రహస్య శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ విజయం సాధించలేరు. నమ్మక ద్రోహం చేసే స్నేహితులను గుర్తించి వారికి దూరంగా ఉండండి. లోతైన ఆలోచనా శక్తి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. మీ వలన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు.
వృశ్చిక రాశి
ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఏదో పని మీద బయటకు వెళ్ళవచ్చు. విదేశీ ప్రయాణాలు ప్లానింగ్ కి అనుకూలం. మీరు తలపెట్టిన పనులకు స్నేహితులు ,కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సమాజంలోనూ కుటుంబం లోను మీ ప్రతిష్ట పెరుగుతుంది.
Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది
ధనుస్సు రాశి
ఈరోజు శుభదినం. పనులు సులభంగా పూర్తిచేస్తారు. దాన, ధర్మాలలో పాల్గొంటారు. ఈ రోజు మొత్తం సరదాగా గడుపుతారు. గౌరవం లభిస్తుంది. గృహ జీవితంలో ఆనందం ఉంటుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. సామాజిక వ్యక్తులతో అర్థవంతమైన చర్చ ఉంటుంది. మీరు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఏ పనిని చిన్నదిగా భావించవద్దు. అనుభవజ్ఞులైన వ్యక్తులు సహాయం చేస్తారు.
మకర రాశి
ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పనుల వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉండండి. కుల వృత్తులపట్ల ఆసక్తి ఉంటుంది. స్వల్ప అనారోగ్యం. శారీరక అలసట ఉంటుంది. కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు. ప్రయాణాలు మానుకోండి, నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి.
కుంభ రాశి
కోపం ఎక్కువుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మాటతీరులో సంయమనం లేకపోవడం వల్ల కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. దగ్గరి బంధువుల వల్ల విబేధాలు, కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరించదు. ప్రమాదాన్ని నివారించండి. భగవంతుని నామ స్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. బంధువులతో చర్చలు.
మీన రాశి
ఈ రోజు అత్యంత శుభకరం. వ్యాపారంలో భాగస్వామ్య పెట్టుబడులకు ఇది ఉత్తమ సమయం. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు. స్నేహితులతో అనుబంధం మరింతగా బలపడుతుంది. ప్రజా జీవితంలో పురోగతి ఉంటుంది. దాంపత్య సుఖాన్ని పొందుతారు. మీరు మీ బలహీనతలను జయించటానికి ప్రయత్నించండి .