Horoscope Today July 27, 2023


మేష రాశి
ఈ రాశివారు ప్లాన్ చేసుకున్న పనులన్నీ యధాప్రకారంగా చేసేస్తారు. మీ జీవనశైలి బావుంటుంది. వ్యాపారంలో పురోగతితో సంతృప్తి చెందుతారు. సంతోశం ఖర్చు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు  డబ్బు కొరత తీరుతుంది. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి. 


వృషభ రాశి
ఈ రాశివారు ద్రవ్య ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల విషయంలో మాట తూలకండి. యువత తమ కెరీర్ కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అనుకున్న పనులున్నీ అనుకున్న సమయానికి పూర్తిచేసేందుకు ప్రణాళికలు వేసుకోండి. వాయిదా వేయవద్దు. పిల్లల గురించి ఆందోళన ఉంటుంది.


మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన విషయాల గురించి కొంత ఆందోళన ఉంటుంది. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలపై ఒత్తిడులు తొలగిపోతాయి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండండి 


కర్కాటక రాశి
వ్యక్తిగత సంబంధాలలో స్వార్థానికి అవకాశం ఇవ్వకండి. కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేయగలరు. రొటీన్‌లో బిజీగా ఉండకండి. అసాంఘిక కార్యకలాపాలకు దూరం పాటించండి. కొన్ని కారణాల వల్ల మనసులో ఒత్తిడి ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల అసలు పని చెడిపోతుంది.


Also Read: పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!


సింహ రాశి
ఈ రాశివారి దినచర్య బావుంటుంది. ప్రణాళికాబద్ధంగా చేసే పనులన్నీ విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పాతమిత్రులను కలుస్తారు. ఈ రాశి స్త్రీలకు  అనారోగ్య  సమస్యలు రావొచ్చు. పిల్లల పురోభివృద్ధి చూసి ఉత్సాహంగా ఉంటారు. వారిపై అధిక ఒత్తిడి తీసుకురావొద్దు. 


తులా రాశి
మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది.  శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఖర్చుతో పోలిస్తే మీ ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. జీవిత భాగస్వామి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందవచ్చు.


వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు అధికారులకో వాదనలు పెట్టుకోవద్దు. మీ గౌరవం గురించి ఆందోళన చెందుతారు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయొద్దు. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఎదుటివారు అడగకుండా సలహాలు ఇవ్వొద్దు. గర్భిణిలు జాగ్రత్త. 


ధనుస్సు రాశి
ఈ రాశివారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. పెండింగ్ లో ఉన్న ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కివస్తాయి. న్యాయపరమైన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


మకర రాశి
ఈ రాశివారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వివాహ సంబంధాలలో పరస్పర గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. అవసరమైన గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు.


కుంభ రాశి
ఈరోజు వ్యాపారానికి సంబంధించి పెద్ద భాగస్వామ్యం ఉంటుంది. ఉద్యోగులు బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.


Also Read : మరణ సమయంలో స్వరం ఎందుకు పోతుందో తెలుసా?


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి . చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించద్దు. అనవసర విషయాలపై దృష్టి మరలే అవకాశం ఉంది.