ఆగష్టు 4 రాశిఫలాలు, ఈ రాశి ఉద్యోగులు - వ్యాపారులకు కలిసొచ్చే సమయం

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

Horoscope Today 2023 August 4rd 
మేష రాశి 
ఈ రోజు మేషరాశివారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.  స్నేహితుల సహకారంతో వ్యాపారం, ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేయగలుగుతారు. 

Continues below advertisement

వృషభ రాశి
ఈ రాశివారి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. 

మిథున రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రతి పనిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సహజంగా ఉండే చిరాకును తగ్గించుకోవాలి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లాలి అనుకున్నవారికి నిన్నటి వరకూ ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.పిల్లల్లో మనోధైర్యం పెంచేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు

Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!

కర్కాటక రాశి
ఈ రాశివారు ఆర్థిక సంబంధిత విషయాల్లో పదే పదే పొరపాట్లు చేస్తూనే ఉంటారు..ఇకనైనా డబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి.  నిర్మాణ పనుల్లో ఉన్నవారు తొందరపడండి లేదంటే అనుకోని ఆంటకాలు ఎదురుకావొచ్చు. మీ ప్రియమైన వారి మనోభాాలను అగౌరవపరచవద్దు. ఆకస్మికంగా చేయాల్సిన కొన్ని పనుల కారణంగా  ఉద్యోగులు తమ పనిని సకాలంలో పూర్తిచేయలేరు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు ధనలాభం పొందుతారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబం కోసం సమయం కేటాయించాలి. 

కన్యా రాశి
ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి. సమాజంలో గౌరవం పొందుతారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. బంధువులను ఎక్కువగా నమ్మొద్దు. మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకుంటే మంచి జరుగుతుంది. పాత అప్పులు తీర్చడంలో సక్సెస్ అవుతారు.

తులా రాశి
ఈ రాశివారు ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. మీ మాటతీరు ఆకట్టుకునేలా ఉంటుంది. 

వృశ్చిక రాశి
ఈ రాశివారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ చాకచక్యం ప్రశంసలు అందుకుంటుంది. కార్యాలయంలో మీ పనిని నిర్లక్ష్యం చేయకండి. వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపవద్దు. కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోవచ్చు. అలర్జీ సమస్యలు వేధిస్తాయి. 

Also Read: ఈ రాశుల వారు ప్రేమ కోసం ఫైట్ చేయొద్దు - మీ జాతకంలో లవ్ మ్యారేజ్ లేదు!

ధనుస్సు  రాశి
ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ పనితీరుని ప్రశంసిస్తారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. దానధర్మాలకు ధనం ఖర్చు చేస్తారు. కొన్ని విషయాలలో రిస్క్ తీసుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

మకర రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఈ రోజు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. ఆరోగ్యం బావుంటుంది. శ్రమకు తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.మీ ప్రవర్తన అందరూ మెచ్చేలా ఉంటుంది. వ్యాపారంలో నూతన పట్టుబడులకు ఇదే మంచి సమయం. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.

కుంభం 
నిన్నటి వరకూ వెంటాడిన ఓ సమస్య నుంచి మీరు బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో కాస్త సున్నితంగా ఉంటారు. కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని వీడండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

మీన రాశి
ఈ రాశివారికి ఇంట్లో వాతావరణం ఒత్తిడితో కూడుకున్నది అయి ఉంటుంది. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపడకండి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు అవసరమైన పత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. 

గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Continues below advertisement