Horoscope Today October 19th, 2023


మేష రాశి
ఈ రాశివారు రోజంతా బిజీ బిజీగా ఉంటారు. అయితే చేసే పనులపై ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యతను సెట్ చేసుకోవాలి. చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి. మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


వృషభ రాశి
మీరు మీ కృషి, అంకితభావానికి తగిన గుర్తింపు పొందవచ్చు. పురోగతికి కొత్త అవకాశాలు ఉండవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ప్రమోషన్, బోనస్ లేదా కొత్త ఉద్యోగావకాశాల ఫలితం కావచ్చు. అయితే, అవసరానికి మించి ఖర్చు చేయడం తగ్గించాలి.


మిథున రాశి
మీ కష్టానికి ప్రతిఫలంగా మీరు కోరుకున్నంత పురోగతి లేదనే భావనలో మీరుంటారు. కానీ గుర్తు పెట్టుకోండి..మీ పురోగతికి ఇంకా సమయం పడుతుంది. మిమ్మల్ని మీరు రోజు రోజుకీ మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఏకాగ్రతతో వ్యవహరించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకునే రోజులున్నాయని మర్చిపోవద్దు.


Also Read: మీ మేని ఛాయను మెరుగుపరిచే పూలు ఇవి - బతుకమ్మని తయారు చేయడంలో స్పెషల్ అట్రాక్షన్ ఇవే!


కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. అయితే అధిక ఒత్తిడికి గురికావొద్దు...ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. సహోద్యోగుల నుంచి సహకారం చాలా అవసరం. అన్ని పనుల భారం మీరే మోయకుండా ఇతరులకు అప్పగించి పూర్తిచేయించడం కూడా నాయకత్వ లక్షణం అని గుర్తుంచుకోవాలి.ముందు అందరితో స్నేహం ఏర్పరుచుకునేందుకు ప్రయత్నించాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. 


సింహ రాశి
ఈ రాశివారు ధైర్యంగా అడుగేయడానికి, పెద్ద పెద్ద కలలు కనేందుకు భయపడొద్దు. ఏదైనా ప్రధాన కెరీర్ నిర్ణయాలు తీసుకునే ముందు సంభావ్య ప్రయోజనాలు మరియు లోపాలను అంచనా వేయడానికి సమయాన్ని వెచ్చించండి. మీ ఎంపికలను జాగ్రత్తగా పరిగణించండి. డబ్బుకు సంబంధించిన ఏవైనా అనుకోని సంఘటనలకు సిద్ధంగా ఉండండి.


కన్యా రాశి 
ఈ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. పరిష్కారం లేని సమస్య ఉండదు..ఆలోచించి అడుగేయండి. మీ పనిపై సంపూర్ణంగా దృష్టి సారించాలి. 


Also Read: బతుకమ్మ పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారో తెలుసా!


తులా రాశి
ఈ రాశివారు ఈ రోజుని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కానీ సాధారణ ఫలితాలు మాత్రమే పొందుతారు. సహోద్యోగులు లేదంటే బాస్ తో వివాదం జరిగే అవకాశం ఉంది. అయితే ఓ అడుగు వెనక్కు వేసి వారి కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మాట తూలకండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవాలి. 


వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజు ఏదో అసంతృప్తి భావనతో ఉంటారు. మీకు అర్హమైన ప్రశంసలు లేదా రివార్డ్‌లు మిస్సయ్యాయి అనే భావనలో ఉంటారు. మీలో ఏదో నిరాశ ఆవహిస్తుంది. అయితే మీరు చేయాలి అనుకున్న పనిని చేస్తూ వెళ్లండి..ఫలితం అదే వస్తుంది. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


ధనుస్సు రాశి
ఈ రాశివారు అనవసర గందరగోళానికి గురికాకుండా ముందుగా ప్రాధాన్యతలను సెట్ చేసుకోవాలి. విభిన్న పనులు, బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. చేయాలి అనుకున్న పనులు సమయానికి చేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందే   మీ విజయానికి అత్యంత ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. 


మకర రాశి
మీరు మీ ఉద్యోగంతో సంతృప్తి చెందకపోతే, మార్పు చేయడానికి ఇది సమయం. ఇందులో మీ ప్రస్తుత ఫీల్డ్‌లో కొత్త అవకాశాల కోసం వెతకడం లేదా పూర్తిగా కొత్త ఫీల్డ్‌లోకి ప్రవేశించడం వంటివి ఉండవచ్చు. 


Also Read: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!


కుంభ రాశి
కెరీర్‌కు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. మీ పనికి మరింత వ్యూహాత్మక విధానాన్ని తీసుకోండి, మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి మరియు మీ నెట్‌వర్క్‌ని నిర్మించడంపై దృష్టి పెట్టండి మరియు మీ వృత్తిపరమైన అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించండి. 


మీన రాశి
మీరు కొద్దిగా అస్తవ్యస్తంగా అనిపించవచ్చు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మీరు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఓపికపట్టండి మరియు ఒక సమయంలో ఒక అడుగు వేయండి. మీరు మీ ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉంటే, మీరు మార్పు కోసం చూడవచ్చు. కొత్త కెరీర్ ఎంపికలను అన్వేషించడం ప్రారంభించడానికి ప్రత్యేక తయారీ అవసరం.