Daily Horoscope Predictions in Telugu


మేష రాశి


ఈ రోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి  కనబరుస్తారు. వైవాహిక జీవితంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అలసటను అనుభవిస్తారు. ఇతరుల లోపాలపై కాకుండా మీపై మీరు దృష్టి సారించండి. 


వృషభ రాశి


ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ పని తీరు మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తి కాగలవు. మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు.


మిథున రాశి


మీ శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. అభిప్రాయాల గురించి మొండిగా వ్యవహరించవద్దు.  వ్యాపారాన్ని విస్తరించేందుకు అప్పులు తీసుకోవాలనుకుంటారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. 


Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
 
కర్కాటక రాశి


ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈరోజు కొంత విచారంగా ఉంటారు. పరిస్థితులు మీకు అంత అనుకూల ఫలితాలను ఇచ్చేలా లేవని గుర్తించాలి. మిమ్మల్ని అందరూ తప్పుగా అంచనా వేస్తారు. పిల్లల ప్రవర్తనకారణంగా కొంత అసంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


సింహ రాశి
 
నూతన ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం బావుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రత్యర్థులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి రావొచ్చు. వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నట్టు ఉంటుంది.


కన్యా రాశి


ఈ రాశివారు వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలున్నాయి. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. కొత్త ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టవచ్చు. సబార్డినేట్ ఉద్యోగులు మీతో సంతోషంగా ఉంటారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.


Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!


తులా రాశి


ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు.  ఇతరులపై పూర్తిగా ఆధారపడటం సరికాదు. మీ నైపుణ్యాలు , సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకున్న తర్వాత పని చేయడం లాభదాయకంగా ఉంటుంది: 


వృశ్చిక రాశి 


ఈ రోజు బోధనా పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు. మీరు మీ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యావంతులలో మీ గౌరవం పెరుగుతుంది. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టొచ్చు


ధనస్సు రాశి


ఈ రోజు మీ శత్రువులు మీపై దూకుడుగా మారవచ్చు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  కార్యాలయంలో అధికారులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 


మకర రాశి


 వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!


కుంభ రాశి


ఈ రాశివారు శుభ కార్యాలలో ధనం వెచ్చించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉదార స్ఫూర్తితో ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.  కార్యాలయంలో మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 


మీన రాశి


ఈ రోజు మీరు కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావచ్చు. వ్యాపారంలో  బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం సరికాదు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.