Horoscope Today 15th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ పాత దినచర్యను ఫాలో అవడమే బావుందని ఫిక్సవుతారు. సాధ్యమైనంత వరకు కొత్త పనులపై దృష్టి సారించండి. మీ జీవితంలో కొన్ని మార్పులొస్తాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం పనులు జోరందుకుంటాయి. మీ కుటుంబం నంచి మీకు మద్దతు లభిస్తుంది. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి
ఈ రోజు మీకు కొత్త వ్యక్తి పరిచయమవుతారు..వీరి కారణంగా మీకు మంచే జరుగుతుంది. రోజంతా సానుకూల ఆలోచనతో ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు సంయమనం కోల్పోవద్దు.
మిథునం
ఈరోజు మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. మీపై మీకున్న నమ్మకంతో ముందడుగు వేస్తారు. వ్యక్తిగత,వృత్తి పరమైన వ్యవహారాల్లో అనవసర వాదనలు పెట్టుకునేందుకు ఇది మంచి సమయం కాదు. కుటుంబంతో కొంత సమయం గడపండి.
Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!
కర్కాటక రాశి
ఈ రోజు తలపెట్టిన పనులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఓ విషయంలో మీరు అయోమయానికి గురవుతారు. మీతో మాట్లాడేందుకు మీ చుట్టుపక్కల వారు వెనుకంజ వేస్తారన్న విషయం మీకు గమనించాలి. సమస్యలని ఎదుర్కోవడం మీ జీవితంలో ఓ భాగంగా మారుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
సింహ రాశి
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..గౌరవం పొందుతారు. మీ సక్సెస్ ను మీరు ఎంజాయ్ చేయండి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్యారాశి
ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దృక్పథాన్ని సానుకూలంగా మార్చుకోండి. మీరిచ్చే భరోసా ఎంతోమందిని సమస్యల నుంచి బయటపడేస్తుంది. భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. నూతన ప్రణాళికలకు ఇది సరైన సమయం.
తులా రాశి
వ్యాపారుల ఎదుగుదలకు మంచి సమయం. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. దీర్ఘకాలంగా ప్రయోజనాలను పొందుతున్న రంగాలపై దృష్టి సారించాలి. ఏదైనా పని చేయడానికి ముందు ఓసారి ఆలోచించండి.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజు సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో వివాదం పెట్టుకుంటారు..ఆ ధోరణి విడిచిపెట్టి కుటుంబంపై కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సన్నిహితుల సహాయం మీకు అవసరం అవుతుంది..ఈ విషయంలో సంకోచాన్ని వీడండి.
Also Read: అక్టోబరు 16 న మిథునంలోకి కుజుడు, ఈ రాశులవారికి నెలరోజుల పాటు కష్టాలు తప్పవు!
ధనుస్సు రాశి
ఈ రోజంతా మీరు నూతన ఉత్సాహంతో ఉంటారు. ఏదైనా పని భిన్నంగా చేయాలని భావిస్తారు. రెగ్యులర్ పనులపై బోర్ కొడుతుంది. ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించడం కంటే మీ ప్రస్తుత ప్రాధాన్యతలు లేదా ప్రాజెక్టుల అవసారన్ని బట్టి పని చేయడమే మంచిది.
మకర రాశి
ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలతో మానసిక స్థితిని పాడుచేసుకోవద్దు. మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి.
మీన రాశి
ఈ రోజు మీరు కొంత అసహనానికి గురవుతారు. పెద్ద పెద్ద మార్పులు చేయాలని ఆలోచించేకన్నా... చిన్న చిన్న పరిష్కార మార్గాలు వెతుక్కోవడం మంచిది. పురోగతిపై దృష్టి పెట్టాలి. ఏదైనా పని చేయడానికి తొందరపాటు వద్దు..నెమ్మదిగా, నిలకడగా ఉండాలి. ఒంటరిగా కొంత సమయం గడపాలని అనుకుంటారు.