మేష రాశి
ఈ రోజు మీతో కలిసి పనిచేసే వ్యక్తులు మీకు సహాయకారిగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. గత కొంత కాలంగా కొనసాగుతున్న ఇబ్బందులు సద్దుమణిగే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాపారంలో లాభం ఉంటుంది. వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి.
మిథున రాశి
ఈ రోజు మీరు చేసే ఉద్యోగం, వృత్తి రంగాల్లో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది..చదువుపై ఆసక్తి తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది
కర్కాటక రాశి
ఈ రోజు మీరు పాత స్నేహితుల సహాయంతో ఓ పెద్ద సమస్య నుంచి బయటపడతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పని చేసే ప్రదేశంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. కానీ మొండితనాన్ని అవలంబించకుండా జాగ్రత్త వహించండి.
సింహ రాశి
ఈ రోజు చాలా మంచి రోజు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమన్వయం మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు
కన్యా రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు తమ పనులను సకాలంలో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సరదా సమయం గడుపుతారు.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.అకస్మాత్తుగా వచ్చిన అతిథి కారణంగా మీ ఇంటి వాతావరణం మారుతుంది.
తులా రాశి
ఈ రోజు మీ జీవితంలో ఆకస్మిక మార్పు ఉండవచ్చు. మీకున్న అవగాహనతో ఎలాంటి సమస్యను అయినా సులభంగా పరిష్కరిస్తారు. మీ వ్యాపార భాగస్వామితో విభేదాల కారణంగా చికాకుకు గురవుతారు. నూతన పెట్టుబడుల గురించి ఇప్పుడే ఆలోచించవద్దు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఈ రోజు మీరు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి..బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి
మకర రాశి
ఈ రాశివారు కోపం తగ్గించుకోకుంటే ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. అన్ని విషయాల్లోనూ దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఆర్థికంగా బలపడేందుకు సహాయం పొందుతారు. మీరు ప్రారంభించిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీ అలవాట్లను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నించండి.
కుంభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. వ్యాపారానికి సంబంధించి లాభాలు వస్తాయి. ప్రేమ జీవితంలో బాగుంటుంది..మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచుతారు.
మీన రాశి
ఈ రోజు మీరు పాత ఆస్తి నుంచి డబ్బు పొందుతారు. బిజినెస్ ట్రిప్ కోసం బయటకు వెళ్తుంటే ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మీ పని విజయవంతమవుతుంది. ఈ రోజు మీ జీవితభాగస్వామి పురోగతి సాధించడానికి మంచి అవకాశం వస్తుంది.