జనవరి 04 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తవుతుంది. భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రారంభించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఏకాగ్రతతో పని చేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు
వృషభ రాశి
ఈ రోజు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. చిన్న పిల్లలతో ఆనందంగా గడుపుతారు. చాలా కాలంగా ఎదురుచూసిన వస్తువులు పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు శుభవార్త వింటారు.
మిథున రాశి
ఈ రోజు మీరు అయిష్టంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. మీ దూరదృష్టితో వ్యాపారంలో లాభం ఉంటుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు రావచ్చు
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!
కర్కాటక రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. మీ అహం వల్ల సంబంధాన్ని చెడగొట్టకండి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి బలవుతారు. విద్యార్థులు తమ వృత్తి గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సింహ రాశి
ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. దినచర్య ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నింటినీ సులభంగా పూర్తిచేస్తారు. కష్టతరమైన వ్యాపార పరిస్థితులను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు
కన్యా రాశి
మీరు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మంచిది. సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి మంచి రోజు. పని ఒత్తిడి తగ్గుతుంది. వైవాహిక సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపార విస్తరణలో అడ్డంకులు ఎదురుకావచ్చు. రహస్య విషయాలను అధ్యయనం చేస్తారు. మీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. సోదరులు , సోదరీమణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు.
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!
వృశ్చిక రాశి
మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అపార్థాల కారణంగా బంధంలో చికాకులుంటాయి. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. సోమరితనం వీడండి. యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోవడం మంచుది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో పనులపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సోమరితనం కారణంగా మీ పని అసంపూర్తిగా ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు కలసిరావు. టెక్నాలజీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం కలిసొస్తుంది.
మకర రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. శని అనుగ్రహం ఉంటుంది. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు.
కుంభ రాశి
ఈ రోజు మీ ఆలోచనల్లో సానుకూలత ఉంటుంది. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. విద్యార్ధులు తమ విద్య పట్ల చాలా స్పృహతో ఉంటారు. చాలా రోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ లక్ష్యం కోసం అంకితభావంతో ఉంటారు.
మీన రాశి
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబానికి సమయం కేటాయించాలి. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది. బైక్ లేదా కారు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువు పక్షాన్ని అస్సలు విస్మరించవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.