Daily Horoscope for 15 August 2024
మేష రాశి
ఈ రోజు మీ తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలను బయటివారితో పంచుకోవద్దు. హోటల్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా కొత్త పనిని ప్రారంభించండి. వైవాహిక జీవితంలో సమస్యలు దూరమవుతాయి
వృషభ రాశి
ఈ రోజు మీరు సన్నిహితులతో జాగ్రత్తగా ఉండండి. అలసట కారణంగా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. డబ్బుకి సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టాలి.
మిథున రాశి
ఈ రోజు ప్రారంభం బావుంటుంది. ఎలక్ట్రికల్ ఉపకరణాలను జాగ్రత్తగా వాడండి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి
Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
కర్కాటక రాశి
ఈ రోజు కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. కమీషన్ సంబంధిత విషయాలలో పెద్ద లాభాలు ఉండవచ్చు. ఈ రోజు చాలా అనుకూలమైన , ప్రోత్సాహకరమైన రోజు. మీ పనిని ఇతరులపై రుద్ది వారిని నిందించవద్దు
సింహ రాశి
ఈ రాశి అవివాహితులకు వివాహానికి సంబంధించిన ప్రపోజల్స్ వస్తాయి. ఈ రోజు ఖర్చులపై నియంత్రణ అవసరం. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఓర్పు, సహనం అవసరం. అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు. మీ జీవిత భాగస్వామి భావాలకు విలువనివ్వండి. పనికిరాని చర్చలతో సమయాన్ని వృధా చేయవద్దు. రాజకీయాలతో సంబంధం ఉండేవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది.
తులా రాశి
ఈ రోజు నూతన స్నేహితులు ఏర్పడతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యాటక వ్యాపారంలో ఉండేవారు పెద్ద వ్యాపార ఒప్పందాలను పొందవచ్చు. మీ ఆలోచనలను మీ ప్రియమైన వారితో పంచుకుంటారు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంంది. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
వృశ్చిక రాశి
ఈ రోజు మీ అధికారుల ఆదేశాలను ధిక్కరించవద్దు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. వ్యాపారులు పర్యటనలు చేయాల్సి రావొచ్చు. తీవ్రమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ గౌరవస్థానం బలపడుతుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీరు సహోద్యోగులతో సరదా సమయాన్ని గడుపుతారు.
మకర రాశి
ఈ రోజు మీ శత్రువులను తేలికగా తీసుకోకండి. మానసికంగా కుంగిపోతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావు. రోజు ఆరంభంలో కన్నా రోజు గడిచేకొద్దీ పనుల్లో పురోగతి ఉంటుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి.
కుంభ రాశి
నిరుద్యోగుల అన్వేషణ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిపట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు. పనిపట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు.
మీన రాశి
ఈ రోజు మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.