Horoscope Today November 14, 2024


మేష రాశి


ఈ రోజు పరిశోధనా రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మధురంగా ​​ఉంటుంది. 


వృషభ రాశి


అనవసరమైన ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్న విషయమే అయినా పెద్ద వివాదం జరిగే అవకాశం ఉంది. ఒకరి విజయాల పట్ల మీకు అసంతృప్తి భావన ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి 


మిథున రాశి


మీ సామర్థ్యం కారణంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ, మీరు మీ సన్నిహితులకు సమయం ఇస్తారు. మీ కార్యాలయంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి కొంత ఒత్తిడి ఉండవచ్చు.


కర్కాటక రాశి


ఈ రోజు దినచర్యలో పెద్దగా మార్పులుండవు. కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నవారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు గొప్ప విజయాలు సాధించగలరు. ప్రతికూల వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడవద్దు. మీ పిల్లల కార్యకలాపాలను గమనించండి 


Also Read: మకరం లోకి శుక్రుడు.. డిసెంబర్ లో ఈ 3 రాశులవారికి ఐశ్వర్యం, ఈ 5 రాశులవారికి మనోవేదన


సింహ రాశి


ఈ రోజు రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు గౌరవం , హోదా గురించి ఆందోళన చెందుతారు. సన్నిహితుల మాటలు మీకు చెడుగా అనిపిస్తాయి. కొంతమంది మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అనుకున్న పనులన్నీ టైమ్ కి పూర్తిచేస్తారు. 


కన్యా రాశి


అప్పులు తీసుకోవాలి అనే ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది. అనవసర పనులతో సమయం వృధా చేయవద్దు. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండడం మంచిది. కళలు ,  సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు.  ఏదైనా సమస్యపై త్వరగా స్పందించకండి..లేదంటే నష్టపోతారు


తులా రాశి


ఈ రోజు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. వ్యాపారంలో మీ సహోద్యోగులతో ముఖ్యమైన వ్యవహారాల గురించి చర్చించవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మీకు శుభవార్త అందుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది.


వృశ్చిక రాశి


మీరు నమ్మిన వ్యక్తుల చేతిలోనే మోసపోతారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. రోజు ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!


ధనస్సు రాశి


అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఎవరితోనూ అస్సలు వాదించకండి. ఈరోజు ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది. మీకు ప్రియమైన వారి నుంచి మద్దతు లభించదు. ఏకాంతంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వ్యాపారానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు తగ్గుతాయి. 


మకర రాశి


ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. అహం కారణంగా  శ్రేయోభిలాషులు దూరం కాగలరు. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనం జాగ్రత్తగా నడపండి


కుంభ రాశి


ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారులు మంచి ఒప్పందాలు పొందుతారు. డబ్బు విషయంలో కూడా ఈరోజు మంచి రోజు అవుతుంది. 


మీన రాశి


ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనిని పూర్తి విశ్వాసంతో చేయండి. భూమికి సంబంధించిన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!