Daily Horoscope for 8 September 2024
మేష రాశి
ఈ రోజు మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. హోటల్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. సంతోషాన్ని, బాధలను ఆత్మీయులతో పంచుకుంటారు. ఆదాయం బాగానే ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు అలర్జీకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు గురించి కొంత ఆందోళన ఉంటుంది. మీ ప్రతిభపై నమ్మకం ఉంచుకోండి. ఈ రోజు రిటైల్ వ్యాపారులకు శుభప్రదమైనది.
మిథున రాశి
ఈ రోజు మీరు వ్యక్తిగత సమస్యలను స్నేహితులతో పంచుకుంటారు. పిల్లల కారణంగా బాధపడాల్సి రావొచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
కర్కాటక రాశి
పెండింగ్‌లో ఉన్న ఆదాయం చేతికందుతుంది. తొందరపాటు నిర్ణయాలు మీరు ఒక్కరే ఆలోచించి తీసుకోవద్దు..కుటుంబంతో చర్చించడం మంచిది. నూతనంగా చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.మీ పురోగతితో మీరు సంతృప్తి చెందలేరు.
సింహ రాశి
మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ కోసం ప్రయత్నించడానికి ఇది మంచి సమయం. పిల్లలకు కెరీర్ కి సంబంధించి ఉన్నత సలహాలు ఇవ్వగలరు. టూరిజం సంబంధిత వ్యాపారంలో లాభం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీ పరిచయస్తుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. మీ దినచర్యను ప్రారంభించేముందు తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోండి
తులా రాశి
చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విలువైన బహుమతులు అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ఆధాయం బాగానే ఉంటుంది
Also Read: అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి - అవి ఎలా ఏర్పడ్డాయి -ఎందుకంత పవర్ ఫుల్!
వృశ్చిక రాశి
ఈ రోజు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. జలుబు మరియు గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలుంటాయి. తొందరపాటుతో తీసుకున్న చర్యలు తప్పుగా మారుతాయి. భగవంతుడి ఆరాధన వల్ల ప్రశాంతంగా ఉంటారు.
ధనస్సు రాశి
కుటుంబ సభ్యులు మీ మనోధైర్యాన్ని పెంచుతారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ సలహాల వల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక సంబంధిత ఇబ్బందులున్నా కానీ సమయానికి డబ్బు చేతికందుతుంది.
మకర రాశి
మీ పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. బంధాల మధ్య అహం, అసూయకి చోటివ్వొద్దు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. సకాలంలో పని పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ప్రియమైనవారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
Also Read: బయటకు కంచు లోపల మంచు..సెప్టెంబర్ లో పుట్టినవారి మనస్తత్వం ఇలా ఉంటుంది!
మీన రాశి
మీ పని కోసం ఇతరులపై ఆధారపడకండి. కార్యాలయంలో సహోద్యోగుల కారణంగా ఇబ్బంది పడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.