Daily Horoscope for 5 September 2024

మేష రాశి

ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు. మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులపై రుద్దొద్దు.. సహోద్యోగులతో మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. మీ మేధోపరమైన లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి 

వృషభ రాశి 

భాగస్వామ్య వ్యాపారంలో మీరు లాభాలు పొందుతారు. మధ్యవర్తి కారణంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం బావుంటుంది. ప్రేమ వివాహాలకు సమయం అనుకూలిస్తుంది. 

మిథున రాశి

ఈ రోజు మీరు చాలా భావోద్వేగంగా ఉండవచ్చు. పిల్లల ప్రవర్తనకు సంబంధించి కొంత ఆందోళన చెందుతారు. రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారంలో ముఖ్యమైన మార్పులు చేర్పులు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలుననాయి

కర్కాటక రాశి

ఈ రోజు స్వల్ప దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. కుటుంబ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. వివాదాల్లో ఉండే బంధాలు మళ్లీ దగ్గరవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. 

Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!

సింహ రాశి

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వార్తలు వినాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు.

కన్యా రాశి

ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. మీ వ్యూహాత్మక ప్రవర్తన ప్రశంసలు అందుకుంటుంది. వైవాహిక బంధం బావుంటుంది. కళారంగంలో ఉండేవారు ఆర్థిక లాభాలు పొందుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. 

తులా రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అనుకోని అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అనవసర వాదనలు, చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మానసికంగా బలహీనంగా ఉంటారు. 

వృశ్చిక రాశి 

మీ ప్రవర్తనలో అనుకూల మార్పులు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంా వస్తాయి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. 

Also Read: బయటకు కంచు లోపల మంచు..సెప్టెంబర్ లో పుట్టినవారి మనస్తత్వం ఇలా ఉంటుంది!

ధనస్సు రాశి

ఆత్మవిశ్వాసంతో అడుగువేయండి..సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. పాత పరిచయస్తులను కలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 

మకర రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో గుర్తింపు పొందుతారు. సహోద్యోగుల పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చేపట్టిన పనులకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలు స్వీకరిస్తారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం వస్తుంది. 

కుంభ రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.. కాలుష్య ప్రదేశాలకు దూరంగా ఉండండి. సోమరితనం వల్ల మీకు పనిపై శ్రద్ధ ఉండదు. అనుకోని అతిథులను ఆహ్వానించాల్సి వస్తుంది. 

మీన రాశి

ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో జాప్యం కొనసాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ప్రేమ సంబంధాలలో సంతోషంగా ఉంటారు.  

Also Read: సెప్టెంబరు 2024 లో ఈ రాశులవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు - ఆర్థికాభివృద్ధి ఉంటుంది !

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.