Daily Horoscope for 17 September 2024


మేష రాశి


మీరు ఈ రోజు పెద్ద లక్ష్యాలను సాధించగలరు. వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు అధిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది


వృషభ రాశి


మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు ఇంట్లోనే రుచికరమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు పొందుతారు. కడుపునొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు మిథున రాశి ఫలం 17 సెప్టెంబర్ 2024 


మిధున రాశి


ఈరోజు మీరు పనికి తగిన ఫలితాలను పొందలేరు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి సందేశాలు అందుతాయి. మేనేజ్‌మెంట్ రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 


కర్కాటక రాశి


మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. కారణం లేకుండా ప్రయాణం చేయాల్సి రావచ్చు. విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. 


Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!


సింహ రాశి 


ఈ రోజు అనుకున్న పనలున్నీ సులువుగా పూర్తవుతాయి. కొత్త ప్రేమ సంబంధాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయాణంలో మీకు ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగం మారడానికి మంచి సమయం. 


కన్యా రాశి


చట్టపరమైన వివాదాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో కష్టమైన పనులకు మీరు బాధ్యత వహిస్తారు. కోప స్వభావం కారణంగా చాలా నష్టపోతారు. ఎవరి పట్లా అసూయ చెందవద్దు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.


తులా రాశి 


ఈ రోజు వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. సాంకేతిక రంగానికి సంబంధించిన కెరీర్‌లో మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు.  పని వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ స్థలంలో మార్పు ఉండవచ్చు.


Also Read: ఏపీ, తెలంగాణలో ఈ ప్రాంతాల్లో నిమజ్జనం అదిరిపోతుంది!


వృశ్చిక రాశి


మీ మనస్సులో సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి శుభ సందేశాలను అందుకుంటారు. తలకు సంబంధించిన అనారోగ్యం ఏదైనా అనిపిస్తే వెంటనే  వైద్యుడిని సంప్రదించడానికి సంకోచించకండి. ప్రజలను మెప్పించే ప్రయత్నంలో సమయాన్ని వృథా చేయవద్దు. స్నేహితుడితో కలిసి ప్రయాణం చేస్తారు. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ప్రణాళికలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. 


Also Read: మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!


మకర రాశి


ఇంట్లో సంతోషం పెరుగుతుంది. స్తిరాస్థిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. 


కుంభ రాశి


నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కూడా పని చెడిపోతుంది. 


మీన రాశి


నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాస్త ఓపికగా ప్రవర్తించండి. సీనియర్ అధికారులు మీకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తారు.. అప్రమత్తంగా వ్యవహరించండి. 


Also Read: గణేష్ నిమజ్జనం సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఇవే!