Astrology: ఈ రాశులవారు కొత్తదనం కోరుకుంటారు.. అందుకోసం అడ్వెంచర్స్ చేసేందుకు వెనుకాడరు!

Astrology: కొన్ని రాశులవారు తమ జీవితంలో కొత్తదనం కోరుకుంటారట... అందుకోసం కొన్ని అడ్వెంచర్స్ చేసేందుకు కూడా వెనుకాడరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.. ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారు...

Continues below advertisement

Zodiac Signs: కొందరు నిత్యనూతనంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం అడ్వెంచర్స్ అయినా చేసేందుకు అస్సలు వెనుకాడరు. ఇందుకు తగ్గట్టుగా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు..స్నేహితులు, సన్నిహితులకు సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.  

Continues below advertisement

మేష రాశి (Aries)

ఈ రాశివారు ఎప్పుడూ ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎంత పెద్ద సమస్యను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అనుభవజ్ఞుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ సమయం అయినా, వ్యక్తిగత సమయం అయినా కొత్తదనం కోరుకుంటారు. ఏ పనీ లేకుండా వీళ్లు ఖాళీగా కనిపించే సమయం చాలా తక్కువ.  చిన్న గ్యాప్ దొరికినా షాపింగ్ చేయడంపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. తమ అభిరుచికి సంబంధించిన వస్తువులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారు. 

Also Read: డొక్కా సీతమ్మ ఎవరు..ఈ తరం ఆమె గురించి తప్పనిసరిగా ఎందుకు తెలుసుకోవాలి!
 
మిథున రాశి (Gemini)

మిథున రాశివారు ఎప్పుడూ బిజీగానే ఉండేందుకు ఇష్టపడతారు. అయితే తమపనుల్లో బిజీగా ఉంటారు లేదంటే స్నేహితులు సన్నిహితులకు సహాయం చేయడంలో బిజీగా ఉంటారు. వీరి చుట్టూ ఉండే వాతావరణం కొత్తగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఈ రాశివారితో స్నేహం సంతోషం నింపుతుంది. కొత్త విషయాలు అన్వేషిస్తుంటారు, ఫ్యాషన్ పై ప్రత్యేక ఆశక్తి కలిగిఉంటారు. ఇక నూతన వస్తువులు కొనుగోలు లోనూ అస్సలు తగ్గరు. హఠాత్తుగా షాపింగ్ చేసే ప్రత్యేక అలవాటు ఈ రాశివారి సొంతం.  తమ జీవితంలో ఎదుర్కొనే బాధల నుంచి ఉపశమనం కోసం షాపింగ్ ని ఓ ఆయుధంలా వాడేస్తుంటారు.  

Also Read: 9 నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం - సర్పదోషం, నాగదోషం సహా సకల దోషాలకు పరిహారం!

సింహ రాశి (Leo)

ఈ రాశివారు మహారాజులా ఉండాలనుకుంటారు. ఈ రాశివారికి లగ్జరీ లైఫ్ అంటే చాలా మక్కువ. జీవితంలో కొత్తదనం కోసం ఒక్కోసారి అడ్వెంచర్స్ చేస్తుంటారు. సెలబ్రెటీ లైఫ్ ని గడపాలి అనుకుంటారు..అందుకే..ఎక్కువగా సెలబ్రెటీలు వినియోగించే వస్తువులపై ఆసక్తి పెంచుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు అవసరం అయినా తగ్గేదే లే అన్నట్టుంటారు. పైగా వీరి ఆలోచనలు శాశ్వతంగా అలానే ఉండిపోతాయని కూడా చెప్పలేం..ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ రాశివారికి షాపింగ్ అంటే మహా ఇష్టం...

ధనస్సు రాశి (Sagittarius) 

ధనస్సు రాశివారు జీవితంలో కొత్తదనం కోరుకుంటారు కానీ వీరి జీవితంలో ఎక్కువ సమయం సమస్యలతోనే గడిచిపోతుంది. అందుకే ఆ చికాకు నుంచి బయపడేందుకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనసు బాలేనప్పుడు స్నేహితులు, సన్నిహితులతో సమయం స్పెండ్ చేయాలి అనుకుంటారు. ఆ సమయంలో షాపింగ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. సర్ ప్రైజ్ గిఫ్టులు ఇవ్వం, తీసుకోవడం అంటే ఈ రాశివారికి మహాఇష్టం.  

Also Read: ఆగష్టు 04 చుక్కల అమావాస్య..ఇలా చేస్తే మీరు ఉహించనంత ఫలితం పొందుతారు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Continues below advertisement