Navapancham yoga 2024: నవపంచం యోగం అంటే "తొమ్మిదవ  - ఐదవ యోగం", బృహస్పతి ...కుజుడు లేదా కేతువు అనే రెండు గ్రహాలు నిర్దిష్ట, ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. కుజుడు లేదా కేతువు తొమ్మిదవ ఇంట, బృహస్పతి ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు నవపంచమ యోగం ఏర్పడుతుంది. దేవతల గురువైన బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. కేతువు ఈ ఏడాది మొత్తం కన్యారాశిలో సంచరిస్తున్నాడు. నవపంచం యోగం కొన్ని రాశులవారికి అశేష ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి. నవపంచం యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.


మిథున రాశి


బృహస్పతి , కేతువుల సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం ఉద్యోగులకు అత్యంత శుభసమయం. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. మీరు ఎంత నిర్భయంగా ఉంటారో సక్సెస్ మీకు అంత దగ్గరగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు కలిసొస్తాయి. వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కల ఫలిస్తుంది. నవపంచం యోగం సమయంలో కుటుంబ సంబంధాలు బలపడతాయి.


Also Read:  మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు!


వృషభ రాశి


నవపంచం యోగం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.  ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై కచ్చితంగా శ్రద్ధ వహించండి. 


సింహ రాశి


సింహరాశివారికి నవపంచం యోగం సమయంలో ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతికి స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి పొందుతారు. నిబద్ధతతో ఎలాంటి అడ్డంకినైనా జయించగలరు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏవైనా న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు అనకూలం అవుతుంది. సొంత వాహనం లేదా ఇంటి లక్ష్యం నెరవేరుతుంది. 


Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!


కన్యా రాశి


కన్యా రాశివారికి నవపంచం యోగం అదృష్టాన్నిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాసయంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. 


ధనస్సు రాశి


నవపంచం యోగం ధనుస్సు రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి ఉంటుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. 


Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!


మకర రాశి


బృహస్పతి మరియు కేతువుల సంచారం మకర రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో మీ స్నేహితులు , ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల ఫలిస్తుంది. వ్యక్తిగత జీవితంలో వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.