Horoscope Today 2nd February 2025: ఈ రాశులవారు డబ్బు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Continues below advertisement

మేష రాశి

కుటుంబ సభ్యులతో అనవసర చర్చలకు దిగొద్దు. ప్రతికూలత అర్థం చేసుకుని అధిగమించేందుకు ప్రయత్నించండి.  అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగం , వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
వృషభ రాశి

ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఇంటి అలంకరణపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారంలో పెద్ద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. 

మిథున రాశి

పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నతి ఉంటుంది. సంబంధాల మధ్య పెరుగుతున్న దూరం తగ్గుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి.

Also Read: ఫిబ్రవరి 07 వరకు మాఘ గుప్త నవరాత్రులు - ఈ దండకం పఠిస్తే సంపద, జ్ఞానం, సానుకూల శక్తి!

కర్కాటక రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. చిన్న చిన్న విషయాలకు అతి ప్రతిస్పందన వద్ద. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. 

సింహ రాశి

మీ కోరికలను ఇతరులపై రుద్దేయవద్దు. అడగకుండా సలహాలు అస్సలు ఇవ్వొద్దు. ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. మారుతున్న వాతావరణం ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 

కన్యా రాశి

హార్డ్ వర్క్ సానుకూల ఫలితాలను పొందుతుంది. మీ ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబంలో చికాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు విద్యకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయి. ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల మీరు అలసిపోతాయి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.

Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెలలో అంతా బావున్నట్టే ఉంటుంది కానీ మానసిక ఇబ్బందులు తప్పవ్

తులా రాశి

ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. శత్రువులు పొంచి ఉన్నారు జాగ్రత్త పడడం మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకునేముందు జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అతిగా మాట్లాడవద్దు.నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. 

వృశ్చిక రాశి

ఈ రోజు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తులపై పని  ఒత్తిడి పెరుగుతుంది. రోజు ఆరంభం కన్నా గడిచేకొద్దీ బావుంటుంది. మీరున్న రంగంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమ సంబంధాలలో జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం కారణంగా చిన్న సమస్యను పెద్దగా మార్చుకుంటారు. ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 

ధనస్సు రాశి

డబ్బు దుర్వినియోగం చేయొద్దు. కొత్త కార్యాచరణ ప్రణాళికలు వేసేముందు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం మంచిది. మీరున్న రంగంలో పని ఒత్తిడి పెరుగుతుంది.అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. 
 
మకర రాశి

ఈ రోజు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం చేస్తారు. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.  రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి రోజు. కెరీర్ ఎంపికలు మీ ముందు కనిపిస్తాయి.

కుంభ రాశి

ఈ రాశి విద్యార్థులు అధ్యయనాలపై ఆసక్తిగా ఉంటారు. ఇతరుల విషయంలో సలహాలు ఇవ్వొద్దు. సోమరితనం వీడండి. కెరీర్ కి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. 

Also Read:  ఫిబ్రవరిలో ఈ రాశులవారికి గ్రహాల అనుకూల సంచారం..పట్టిందల్లా బంగారం!

మీన రాశి

ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారం, మందుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులకు సమయం అంత అనుకూలంగా లేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులుంటాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

 

Continues below advertisement