Monthly Horoscope February 2025
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. జీవిత భాగస్వామిపై ఉండే అపోహలు తొలగిపోతాయి. మీరున్న రంగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మేధోరచనలపై ఆసక్తి కలిగి ఉంటారు. మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది...కొత్తగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలుంటాయి. మీ సామర్థ్యం కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. నిద్రలేమి కూడా ఒత్తిడి వల్ల సంభవిస్తుంది. అనారోగ్య సమస్యలున్నాయి. యోగా , ప్రాణాయామా కోసం సమయం కేటాయించాలి. అనుకోని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహ రాశి ఈ నెల మీకు కొంత పర్వాలేదు. ఫిబ్రవరి ఆరంభంలో కన్నా సెకెండాఫ్ కలిసొస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన విషయాలను తేలికగా తీసుకోవద్దు. కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. నెల ఆరంభం సంతోషంగా ఉంటుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి.
Also Read: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి గ్రహాల అనుకూల సంచారం..పట్టిందల్లా బంగారం!
కన్యా రాశి
ఈ నెలలో మీకు శుభా శుభాలు మిశ్రమంగా ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పని ప్రారంభమవుతుంది. వ్యాపారంలో వినూత్న ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగులు లాభపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి. వ్యాపారంలో రుణాలు తీసుకోవాల్సి రావొచ్చు. సాంకేతిక రంగంలో ఉండే విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు చర్యలవైపు మొగ్గు చూపొద్దు. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపం పెరుగుతుంది.
ధనస్సు రాశి
ఈ రాశివారికి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులన్నీ ఈ నెలలో క్రమంగా జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఈ నెల చివర్లో శుభవార్త వింటారు. కిందస్థాయి ఉద్యోగులు మీపై తిరుగుబాటు చేస్తారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలపై అధిక ఒత్తిడి తీసుకోకండి. గుండె రోగులు ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆకస్మికంగా కొన్ని సమస్యలు రావొచ్చు.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
కుంభ రాశి
ఈ నెలలో డబ్బు ఆదా చేయడంపై శ్రద్ధ పెడతారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చికాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అవివాహితులకు వివాహ సూచన ఉంది. కళతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ నెలలో గౌరవం అందుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు.
మీన రాశి
ఈ నెల ప్రారంభంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నూతన స్నేహితులు ఏర్పడతారు. ఆస్తి వివాదాలు స్నేహితుల సహకారంలో పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న మానసిక సమస్యలు తప్పవు. విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా రాస్తారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉద్యోగం మారాలి అనుకుంటే తొందరపడొద్దు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: రథ సప్తమి, వసంత పంచమి, మహా శివరాత్రి సహా ఫిబ్రవరిలో ( మాఘ మాసంలో) వచ్చే పండుగలివే!