Satyabhama Serial Today Episode సంధ్య లెటర్ పెట్టి సంజయ్‌ని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిపోతుంది. సంజయ్ గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ఏదో ఒకటి చేసి సంధ్యని పంపేయాలని సంధ్యని తిట్టుకుంటాడు. ఇంతలో సంధ్య వస్తుంది. పరుగున వచ్చి సంజయ్‌ని హగ్ చేసుకుంటుంది. నీ కోసం అందరిని వదిలేసి వచ్చేశానని అంటుంది. నాకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అని సంధ్యని పెళ్లి వద్దని చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తాడు. ఎంత చెప్పినా సంధ్య వినదు. ఇంతలో క్రిష్ అక్కడికి వస్తాడు. క్రిష్‌ని చూసిన సంజయ్ క్రిష్ చూస్తే మన పని అయిపోతుంది. వెళ్లిపోదాం రా అంటే నేనే రమ్మన్నాను అని సంధ్య అంటుంది. సంజయ్ షాక్ అయిపతాడు.
క్రిష్: వాడు మగాడు వాడికేం నష్టం లేదు. ఇబ్బంది పడేది నువ్వే. సంధ్య: బావగారు నేను మిమల్ని రమ్మని చెప్పింది. దగ్గరుండి మా పెళ్లి చేయడానికి దూరం చేయడానికి కాదు.క్రిష్: నేను వచ్చింది మిమల్ని దూరం చేయడానికి కాదు. పెళ్లి చేసుకునే పద్ధతి ఇది కాదని చెప్పడానికి. కూతురు అప్పగింతలప్పుడు తండ్రి పెట్టుకునే కన్నీటికి కూతురు పారిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి పెట్టే కన్నీటికి తేడా ఉంటుంది సంధ్య. మీ వాళ్లకి మరోసారి కన్యాదానం చేయడానికి అవకాశం ఇవ్వు.సంధ్య: ఇప్పుడు వాళ్లని తీసుకొచ్చి కన్యాదానం చేయడానికి వాళ్లని తీసుకురండి. ఇక్కడే వెయిట్ చేస్తాం. అవుతుందా అది.క్రిష్: మీ కారణాలు మీకు ఉంటాయి. అలాగే వాళ్ల కారణాలు వాళ్లకి ఉంటాయి. విను సంధ్య. సంజయ్: నేను అదే చెప్తున్నా బ్రో వినడం లేదు.
క్రిష్ ఎంత చెప్పినా సంధ్య వినదు. సంజయ్‌కి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక చిరాకు పడతాడు. సంధ్య మాత్రం తన ఫ్యామిలీ తనకు అవసరం లేదని పెళ్లి చేసుకుంటానని అంటుంది. పెళ్లి చేయకపోతే ప్రాణాలతో బతకను అని క్రిష్ కాళ్ల మీద సంధ్య పడుతుంది. దాంతో క్రిష్ మీ ఇద్దరికీ దగ్గరుండి నేనే పెళ్లి చేస్తానని అంటాడు. పెళ్లి వాళ్లకి విషయం చెప్పగానే వాళ్లు విశ్వనాథం ఫ్యామిలీని తిడతారు. లేచిపోయిన ఫ్యామిలీ అని బోర్డు పెట్టుకోండి.. సిగ్గు లేదు.. అది ఇదీ అని ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్లిపోతారు. విశ్వనాథం పరువే ప్రాణం అని బతుకుతున్న తనని తలెత్తుకోకుండా చేసిందని కుప్పుకూలిపోయి ఏడుస్తాడు. ప్రేమగా పెంచుకుంటే గుండెల మీద తన్నేసి వెళ్లిపోయింది ఇలాంటి పిల్లల్ని ఎందుకు ఇస్తావురా దేవుడా అని విశాలాక్షి ఏడుస్తుంది. సత్య హాల్లో చెల్లిది తనది ఫోటో చూసి కోపంతో హాల్‌లో సోఫా విసిరేసి ఏడుస్తుంది.
సత్య: గడ్డం పట్టుకొని బతిమాలాను అన్నయ్య. మాట వినమని. చిలక్కి చెప్పినట్లు చెప్పాను జీవితం నాశనం చేసుకోవద్దే అని ఇలా చేస్తుందని అస్సులు అనుకోలేదు.క్రిష్: మనసులో.. క్షమించు సత్య ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాలేదు. ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. నీకు ఇష్టం లేని పెళ్లికి ఇక్కడ నేను సాక్షిగా మారాను. తప్పుగా అనుకోకు సత్య తప్పడం లేదు.
సంధ్య, సంజయ్‌ల పెళ్లి అయిపోతుంది. సత్య క్రిష్‌కి విషయం చెప్పాలని ఫోన్ చేస్తుంది. క్రిష్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇక సంధ్య, సంజయ్ క్రిష్ ఆశీర్వాదం తీసుకుంటారు. మళ్లీ సత్య కాల్ చేయడంతో క్రిష్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. సంధ్య మోసం చేసిందని పారిపోయిందని సత్య ఏడుస్తూ చెప్తుంది. ఇంటి పరువు పోయిందని అందరూ తలోపక్క తల పట్టుకొని కూర్చొన్నాం అని ఏడుస్తుంది. క్రిష్ ఒక్క మాట కూడా మాట్లాడడు. సంధ్యని వెతికి తీసుకురావాలని సంజయ్‌ని కలవనివ్వకూడదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!